Chandrababu Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు.. ఇంటి నుంచి బ్రేక్‌ఫాస్ట్.. ఏం పంపించారంటే..
చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఆహారం ఇంటి నుంచి పంపించేలా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు ..
- Harishth Thanniru
- Published On : September 11, 2023 / 10:08 AM IST
Chandrababu Naidu Arrest
Chandrababu Naidu In Rajahmundry Central Jail: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి సమయంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అర్థరాత్రి ఒంటి గంట తర్వాత చంద్రబాబుని జైల్లోకి తీసుకెళ్లారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రోడ్డు మార్గాన పోలీసులు చంద్రబాబును తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకోసం జైల్లోని స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని అధికారులు కేటాయించారు. ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు.
YCP MP Vijayasai Reddy: చంద్రబాబు రాజకీయ జీవితం 2023 వరకేనా? ఎలా అంటే.. విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ ఎదురుగానే జైలు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు.. చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణితో ములాకత్‌కు అనుమతించారు. దీంతో వారు చంద్రబాబును కలవనున్నారు.
చంద్రబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా ఆహారం ఇంటి నుంచి పంపించేలా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు చంద్రబాబుకు అల్పాహారాన్ని పంపించారు. జైలు సిబ్బంది అల్పాహారాన్ని చంద్రబాబుకు అందించారు. అల్పాహారంలో ఫ్రూట్ సలాడ్ ఉంది. అల్పాహారం తరువాత తాగేందుకు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని కుటుంబ సభ్యులు చంద్రబాబుకు పంపించారు.
