×
Ad

TDP Vs YCP : అసలైన పూజ ఏంటో త్వరలో వైసీపీ బ్యాచ్‌కు అర్థమౌతుంది

ఇకముందు..ఎవరైనా ఆడబిడ్డలను ఏదైనా అంటే..వారి ఇళ్లల్లోకి వెళ్లి చెప్పులతో సమాధానం చెబుతామని వంగలపూడి అనిత అన్నారు.

  • Published On : November 26, 2021 / 04:51 PM IST

Anitha

TDP Leader Vangalapudi Anitha : వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శల వర్షం ఇంకా తగ్గడం లేదు. మాటల తూటాలు పేలుతుండడంతో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. తన కుటుంబాన్ని వైసీపీ నేతలు అవమానించారని..తాను సీఎం అయ్యే దాక అసెంబ్లీలో అడుగుపెట్టను అంటూ..శపథం చేసి…బయటకు వచ్చిన తర్వాత..చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో..పలువురు వైసీపీ నేతలు, టీడీపీ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా…తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అధికార పార్టీ పేటీఎం బ్యాచ్ పై అసలైన పూజ ఏంటో ఈ రోజు తెలియచేస్తామన్నారు. అది బడితె పూజో..మరోరకమైన పూజో త్వరలోనే వైసీపీ బ్యాచ్ కు అర్థమౌతుందని తెలిపారు.

Read More : Nellore : పెన్నానది బ్రిడ్జిపై రాకపోకలు బంద్, రిపేర్ చేస్తారా ? కొత్తది కడుతారా ?

టీడీపీ అధినేత సతీమణిని దూషించిన వారిని టీడీపీ మహిళా నేతలు ప్రశ్నించడం తప్పా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించిన స్వప్న, విజయశ్రీ, జానకి, తేజస్వినిల ఇళ్ల మీదకు పోలీసులను పంపి సెర్చ్ చేసి వారిని భయబ్రాంతులకు గుర చేశారని వెల్లడించారు. వారు చేసిన తప్పేంటీ అని మరోసారి నిలదీశారు. ఏ మాత్రం క్యారెక్టర్ లేని వాళ్లు..బాబు సతీమణిని, ఎన్టీఆర్ కుమార్తెను దూషిస్తే..చూస్తూ ఊరుకోవాలా ? దూషణలకు పాల్పడిన వారికి భద్రత కల్పిస్తారా ? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకముందు..ఎవరైనా ఆడబిడ్డలను ఏదైనా అంటే..వారి ఇళ్లల్లోకి వెళ్లి చెప్పులతో సమాధానం చెబుతామని వంగలపూడి అనిత అన్నారు.