Koona Ravikumar: “అందుకే ఇప్పుడు మరో నాటకం మొదలుపెట్టారు”.. సౌమ్య ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కూన రవి

"సౌమ్యది నాటకం అని ప్రజలందరికి తెలిసింది. ఫేక్ ప్రచారానికి కారణమైన వ్యక్తులు మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్యేల దగ్గరికి ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు, కార్యకర్తలు దేవాలయ లెటర్స్ కోసం వస్తారు" అని అన్నారు.

Koona Ravikumar

Koona Ravikumar: ఆంధ్రప్రదేశ్‌లోని ఆముదాలవలస ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్-కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఎపిసోడ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై శ్రీకాకుళం జిల్లాలో కూనరవి కుమార్ మాట్లాడారు.

“సౌమ్యది నాటకం అని ప్రజలందరికి తెలిసింది. ఫేక్ ప్రచారానికి కారణమైన వ్యక్తులు మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్యేల దగ్గరికి ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు, కార్యకర్తలు దేవాలయ లెటర్స్ కోసం వస్తారు.

అలాగే, మా పార్టీ మహిళా కార్యకర్తలు నాతో పాటు దర్శనానికి వస్తామన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి వైసీపీకి అధినేతగా ఉన్నారు. మహిళల పట్ల వైసీపీ వాళ్లు ఎలా వ్యవహరిస్తారో తెలుసు. (Koona Ravikumar)

Also Read: Astrologer VenuSwami: వేణుస్వామిని గుడి నుంచి తరిమేసిన కామాఖ్య అర్చకులు.. వీడియో చూస్తారా?

రాజకీయానికి ప్రిన్సిపల్ ని వాడారు. ఇప్పుడు మరో నాటకం మొదలెట్టారు. అసెంబ్లీ అయ్యాక మా నేతలతో కలిసి తిరుపతి, ఇతర ప్రాంతాల్లో దర్శనాలకు వెళ్లాం. వాళ్లు నాకు అక్కాచెలెళ్లు. వైసీపీ వాళ్లు చూపించిన ఫొటో ఉన్నది నా సిస్టర్. ఆమె ఓ గ్రామానికి సర్పంచ్.

నాతో వచ్చిన వారందరిని కూర్చోబెట్టి ఆశీర్వచనం ఇచ్చారు. ఆ ఫొటోలనువాడుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపటి నుంచి నా ప్రతి ఫొటోను చింతాడ రవికి పంపిస్తా. కూనరవి కులాలకు అతీతం.. ఎంతో మంది నాకు అండగా ఉన్నారు.

జగన్, భారతి.. సమాధానం చెప్పాలి. నీచ వ్యక్తులు ఇన్‌చార్జ్ గా ఉంటే రేపు మీ పార్టీ మహిళలు ఎలా రాజకీయాలు చేస్తారు? వైసీపీ నేతలతో దేవాలయాలకు వెళ్లిన మహిళల పరిస్థితి ఏంటి? కుటుంబ సంబంధాలు అంటే ఏంతో వారికి తెలియదు. చింతాడ రవి ఓటర్ కి ఎక్కువ, వార్డుమెంబర్ కి తక్కువ” అని కూనరవి చెప్పారు.