MLA Pulivarthi Nani : వారంలో చెవిరెడ్డి భరతం పడతాం.. ఎమ్మెల్యే పులివర్తి నాని వార్నింగ్

MLA Pulivarthi Nani : టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంలో చెవిరెడ్డి భరతం పడతామంటూ వార్నింగ్ ఇచ్చారు

tdp mla pulivarthi nani warning to ycp leader chevireddy

MLA Pulivarthi Nani : వైసీపీ నేత చెవిరెడ్డి కుటుంబానికి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్, నారా కుటుంబంపై అబద్ధపు ఆరోపణలు చేస్తే.. వారి భరతం పడతామని హెచ్చరించారు. శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పులివర్తి నాని మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్‌ను విమర్శించే స్థాయి చెవిరెడ్డి కొడుక్కి ఉందా అని ప్రశ్నించారు. మోహిత్ రెడ్డి చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. నారా కుటుంబంపై అబద్ధపు ఆరోపణలు చేస్తే మడత పూజ జరుగుతుంది అంటూ హెచ్చరించారు.

పులివర్తి నాని మాట్లాడుతూ.. ‘‘వెన్నుపోటు అంటేనే చెవిరెడ్డి. గురువుగా చెప్పుకుంటున్న కరుణాకర్ రెడ్డిని, సాయం చేసిన గల్లా అరుణను, పెద్దిరెడ్డిని వెన్నుపోటు పొడిచిన ఘనత చెవిరెడ్డిది. అక్రమ లిక్కర్ కేసులో రూ. 600 కోట్లు కాజేసి చెవిరెడ్డి జైలుకు వెళ్ళాడు. ఆయన జైలుకు వెళ్ళింది జగన్ కోసం కాదు. చెవిరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు కాదు’’ అని ఎద్దేవా చేశారు.

‘‘వారంలో చెవిరెడ్డి భరతం పడతాం. తుడాలో చెవిరెడ్డి చేసిన అవినీతి తొందరలోనే బయట పెడతాం. చంద్రగిరిలో ఓటరు లిస్ట్ కంటే కబ్జా లిస్ట్ ఎక్కువగా ఉంది’’ అని.. త్వరలోనే వీటన్నిటినీ బట్టబయలు చేస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలను ఎవరూ భయపెట్టలేరని, వెంట్రుక కూడా పీకలేరని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పులివర్తి నాని.