ఉపాధ్యాయ బదిలీలు, 18వ తేదీ అర్ధరాత్రి వరకు వెబ్ ఆప్షన్లు గడువు

  • Updated on- December 17, 2020 / 08:23 PM IST

Teacher Transfer Web Options : ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆఫ్షన్లపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటన చేశారు. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదే రోజు అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ప్రారంభమౌతుందని, మొత్తం 16 వేల పోస్టులు బ్లాక్ చేశామన్నారు.

ఉపాధ్యాయ సంఘాలతో విధానపరమైన నిర్ణయాలపై చర్చకు సిద్ధమని వెల్లడించారు. బ్లాకింగ్ ప్రక్రియ లేకపోతే..రాష్ట్ర వ్యాప్తంగా 4008 పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇక ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ కోసం 74 వేల 418 మంది ఐచ్చికాలను ఇచ్చారని, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్ ఫీజులు గత ఏడాది తరహాలోనే ఉండే అవకాశం ఉందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.