Holidays: ఏపీ, టీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరోసారి వరుస సెలవులు వస్తున్నాయ్
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా ఈ నెలలో వరుస సెలవులు(Holidays) భలేగా కలసి వస్తోంది.
Telangana and Andhra Pradesh School students getting series of holidays.
- ఆగస్ట్‌లో వరుసగా లాంగ్ వీకెండ్స్.
- 15, 16 తేదీల్లో స్కూళ్లకు సెలవులు.
- ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.
Holidays: ఆగస్ట్ మాసం వచ్చిందంటే చాలు వరుస పండగలు, జాతీయ పర్వదినాలతో క్యాలెండర్ కళకళలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా ఈ నెలలో భలేగా కలసి వస్తోంది. ఇప్పటికే ఆగస్ట్ 8 (రెండో శనివారం), 9 (ఆదివారం) తో పాటు తెలంగాణలో బోనాల మరుసటి రోజు (ఆగస్ట్ 10) సెలవు (Holidays)రావడంతో మూడ్రోజుల లాంగ్ వీకెండ్‌ను జనం ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మరోసారి వీకెండ్‌తో కలిపి వరుస సెలవులు రానుండటంతో ప్రయాణాలు, పిక్నిక్లు ప్లాన్ చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
ఆగస్ట్ 15, 16న మళ్లీ వరుస హాలిడేస్:
వచ్చే ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన వెంటనే విద్యార్థులకు సెలవు ఇస్తారు. సాధారణ తరగతులు ఏవీ ఉండవు. మరుసటి రోజు ఆగస్ట్ 16న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజుల పాటు సెలవు లభించనుంది. పాఠశాల విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ ఉద్యోగులకు కూడా ఈ శని, ఆదివారాలు పూర్తిస్థాయిలో వీకెండ్ హాలిడేస్‌గా మారుతున్నాయి.
మణిపూర్‌లో ప్రత్యేక సెలవు.. ఏపీ, తెలంగాణలోనూ పండగే:
ఇదిలా ఉండగా, ఆగస్ట్ 13న మణిపూర్ రాష్ట్రంలో ఆంగ్లో-మణిపురి యుద్ధ అమరవీరుల స్మారకార్థం ‘పేట్రియాట్స్ డే’ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. దీంతో అక్కడ ఆగస్ట్ 13, 15, 16 తేదీల్లో హాలిడేస్ వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగస్ట్ 15, 16 తేదీలలో రెండు రోజులు వరుసగా సెలవులు రానుండటంతో విద్యాసంస్థలు, కార్పొరేట్ వర్గాలు ఈ లాంగ్ వీకెండ్‌ను ఆస్వాదించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి.
