Chandrababu Naidu : తగ్గేదేలే.. మీసం మెలేస్తాం.. చంద్రబాబు నాయుడు అదిరిపోయే స్పీచ్.. లోకేశ్ పై ప్రశంసల జల్లు
Chandrababu Naidu : లోకేష్ సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాం. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదు.. అత్యున్నత బాధ్యత, అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
- Harish Thanniru
- Updated on- April 29, 2026 / 11:41 AM IST
Chandrababu Naidu
- తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ ప్రమాణం
- ప్రమాణ స్వీకారం చేయించిన సీఎం చంద్రబాబు
- పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతోనూ ప్రమాణ స్వీకారం
Chandrababu Naidu : టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కీలక కామెంట్స్ చేశారు.
నాలుగు దశాబ్దాల నుంచి కమిటీలపై కసరత్తు చేశాను.. కానీ, ఇంత కసరత్తు ఎప్పుడూ చేయలేదు. ఎన్నో వడపోతలు, లెక్కలు, ఈక్వేషన్లతో కమిటీలను ఏర్పాటు చేశాం. సీనియర్లను గౌరవిస్తూ.. కొత్త వారికి అవకాశాలు ఇస్తూ.. కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలను ఏర్పాటు చేశామని చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కార్యకర్తే అధినేత అనే నినాదంగా కాదు.. విధానంగా మార్చుకున్నామని చంద్రబాబు అన్నారు. మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌ఛార్జికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించాం. మహిళలకు ఎక్కువగా అవకాశాలిచ్చాం. మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతి ఇచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చదువుకున్న వారికి మంత్రి పదవులిచ్చి ప్రోత్సహించామని, రామ్మోహన్ నాయుడు, శబిరి, రాజేష్ వంటి వారిని జాతీయ ఉపాధ్యక్షులుగా చేసుకున్నామని చంద్రబాబు అన్నారు.
ప్రతిపక్షంలో లోకేశ్ చాలా కీలక పాత్రో పోషించారు. ట్రైనింగ్ క్లాసులు మొదలుకొని, కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను లోకేశ్ నిర్వహించారు. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామనే హామీని నెరవేర్చేందుకు లోకేశ్ కృషి చేశారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేశ్ అని చంద్రబాబు నాయుడు కొనాయడారు. లోకేష్ సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదు.. అత్యున్నత బాధ్యత, అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వహించాలని సూచించారు.
ప్రతి పోలింగ్ బూత్‌లో మన బలం పెరగాలి. 2024లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు రావాలి. 2024కు ముందున్న పరిస్థితులన్నీ అందరికీ తెలుసు. నాకు ప్రతి ఘటనా, ప్రతి ఒక్కరి పోరాటం గుర్తుంది. కార్యకర్తలు పడిన కష్టాలు నాకు గుర్తున్నాయి. వెంటిలేటర్ మీదున్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సాయంతో గట్టెక్కిస్తున్నాం. ఒక్కొక్క అడుగు వేస్తున్నాం. వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. నిలిచిన కేంద్ర పథకాలను పునరుద్దరించాం. అప్పులను రీ షెడ్యూల్ చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాం. సంక్షేమం అందిస్తున్నాం. సుపరిపాలనతో వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. ఇలా అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
