విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు : జీవీఎల్
- veegam team
- Published On : February 27, 2019 / 04:11 PM IST
ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్ పర్యటనకు ముందే ప్రజలకు మోడీ కానుక ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని ఆంధ్ర ప్రజలు స్వాగతిస్తారని భావిస్తున్నానని చెప్పారు. రైల్వే జోన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు, ఆదాయం పెరుగుతుందన్నారు.
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఫిబ్రవరి 27 బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సౌత్ కోస్ట్ రైల్వే గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. గుంటూరు, విజయవాడ, గుంతకల్, వాల్తేరులోని ఒక భాగంతో కలిపి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాల్తేరు డివిజన్ ను రాయఘడ్ కేంద్రంగా మార్చబోతున్నట్లు పేర్కొన్నారు.
