×
Ad

Tirupati Election Result 2021 : తిరుపతి బై పోల్ …90 వేల ఆధిక్యంలో గురుమూర్తి

తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలవరకు అందిన సమాచారం మేరకు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది.

  • Published On : May 2, 2021 / 12:52 PM IST

Tirupati Election

Tirupati Election Result 2021 : తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలవరకు అందిన సమాచారం మేరకు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది.

90 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి లీడ్‌లో ఉన్నారు. వైసీపీకి 2 లక్షల 4 వేల 370 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి లక్షా 17 వేల 612, బీజేపీ-జనసేన కూటమికి 20 వేల 811, కాంగ్రెస్ అభ్యర్థికి 3 వేల 280 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదటి నుంచి వైసీపీ లీడింగ్‌లోనే కొనసాగుతోంది.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మృతితో తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగింది. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి ఎం.గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ తరఫున కె.రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతామోహన్‌ బరిలో ఉన్నారు. వీరితో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వివరాలు మధ్యాహ్నం గం.12.05 PM కి ఈ క్రింది విధంగా ఉన్నాయి.

వైసీపీ: 2,04,370(56.1 శాతం)
టీడీపీ: 1,17,612(32.3 శాతం)
బీజేపీ: 20,811(5.7 శాతం)
కాంగ్రెస్ : 3,280(0.9 శాతం)
సీపీఎం :1,892(0.5 శాతం)
ఇతరులు : 11,337(3.2 శాతం)
నోటా: 4,950(1.4 శాతం)