AP Corona Cases : ఏపీలో కొత్తగా 2,145 కరోనా కేసులు, 24 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,145 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 మంది మృతి చెందారు. 2,003 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో సంఖ్య 19,76,141కు చేరింది.
- kunduru Vinod
- Updated on- August 5, 2021 / 05:54 PM IST
Ap Corona Cases
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,145 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 మంది మృతి చెందారు. 2,003 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో సంఖ్య 19,76,141కు చేరింది.
ప్రస్తుతం 20,302 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా ఇప్పటివరకు 13,468 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1756 మంది మృతి చెందారు. ఇక కడప జిల్లాలో అతి తక్కువ మరణాలు సంభవించాయి. ఇక్కడ 626 మంది కరోనాతో మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా మృతుల సంఖ్య కరోనా వల్ల ప్రకాశం ఐదుగురు, చిత్తూరు నలుగురు, కృష్ణాలో నలుగురు, కడప ముగ్గురు, పశ్చిమ గోదావరి ముగ్గురు, తూర్పుగోదావరి ఇద్దరు, అనంతపూర్ గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరుగా మరణించారు.
జిల్లాల వారీగా కేసులు
అనంతపురం 36. చిత్తూరు 369. ఈస్ట్ గోదావరి 428. గుంటూరు 181. వైఎస్ఆర్ కడప 103. కృష్ణా 251. కర్నూలు 54. నెల్లూరు 304. ప్రకాశం 160. శ్రీకాకుళం 34. విశాఖపట్టణం 89. విజయనగరం 28. వెస్ట్ గోదావరి 108. మొత్తం : 2,145
