×
Ad

TTD Accommodation : తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకు పోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు చేసింది.

  • Published On : November 18, 2021 / 09:51 PM IST

Ttd

devotees trapped in Tirupati : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకు పోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు చేసింది. వసతి కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి కోసం ఇబ్బందులు పడుతున్న భక్తులకు తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, రెండు, మూడో సత్రాలలో వసతి ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ ప్రకటించింది.

చిత్తూరు జిల్లాను భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. తిరుమల, తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీ పురం, వరదయ్యపాలెం, సత్యవేడు, నారాయణపురం, బిఎన్. కండ్రిగ, రేణిగుంటలో రహదారులన్నీ జలమయమయ్యాయి.
తిరుమల డిజాస్టర్‌ రికవరీ సెంటర్‌లోకి వర్షపు నీరు చేరింది. టీటీడీ సర్వర్లు, నెట్‌వర్క్‌ పూర్తిగా నిలిచిపోయాయి. తిరుపతి రెండో ఘాట్‌ రోడ్డులో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌ రోడ్డులోకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుపై బండరాళ్లు, చెట్లను టీటీడీ సిబ్బంది తొలగిస్తున్నారు.

Chief Justice NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ అనంతపురం పర్యటన

తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. తిరుపతి బస్టాండ్ నీట మునిగింది. తిరుపతి రహదారులు, బస్టాండ్ జలమయం అయ్యాయి. రేణిగుంట విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తిరుపతిలో ఇంటర్నెట్‌ సేవలు పూర్తిగా స్తంభించాయి. కరకంబాడి రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నడుంలోతు నీళ్లలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

రెండో ఘాట్‌ రోడ్డులో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌లో రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో వాహనాల రాకపోకలను ఇబ్బంది లేకుండా బ్యారికేడ్లు పెట్టారు. కొండచరియలు, చెట్లను టీటీడీ సిబ్బంది తొలగిస్తోంది. స్పైస్‌ జెట్‌, ఎయిరిండియా, ఇండిగో విమానాలు ల్యాండ్‌ కాకుండా మళ్లాయి. పూణె, హైదరాబాద్‌ నుంచి రావాల్సిన స్పైస్‌ జెట్‌, ఇండిగో రద్దయ్యే అవకాశం ఉంది.