×
Ad

Tirumala : శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల

మే20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలని పేర్కొంది.

  • Published On : May 18, 2023 / 12:59 AM IST

Tirumala (Photo : Google)

Srivari Arjita Services : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల అయింది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల క్యాలండర్ ను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. ప్రతి నెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.

మే20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలని పేర్కొంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవా టికెట్లను మే21వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Justice NV Ramana : తిరుమల కొండలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిది : మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రూ.300/- దర్శన టికెట్ల కోటాను మే24న, తిరుపతిలో గదుల కోటాను మే25న, తిరుమలలో గదుల కోటాను మే26న విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.