Tirumala : తిరుమల భక్తులకు అలర్ట్.. సెప్టెంబ‌ర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు, రూముల కోటా విడుదల.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్న భక్తులకోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. సెప్టంబ‌ర్ నెలకు సంబంధించి టీటీడీ (Tirumala September Quota) విడుదల చేయనున్న వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను వెల్లడించింది.

TTD Tirumala September Month Online Tickets Quota Updates 2026

Tirumala September 2026: తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు సిద్ధమవుతున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, రూముల కోటాలను విడుదల తేదీలు, సమయాలను అధికారికంగా వెల్లడించింది. జూన్ 18వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ లోపు ఏరోజు ఏ కోటా విడుదల కానుందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భక్తులు ముందుగానే తమకు అవసరమైన టికెట్లు, సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Also Read : Elon Musk Net Worth : ఎలాన్ మస్క్ సంపదతో ఏపీని 30ఏళ్లు, తెలంగాణను 33ఏళ్లు నడపొచ్చు.. భారతీయ రైల్వేను? ఆశ్చర్యకర లెక్కలు..

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల..

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల..

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల..

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా విడుదల..

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…
తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.