×
Ad

Union Budget 2026: బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు దక్కినవి ఇవే..

అరకులో మౌంటెయిన్ ట్రైన్, పులికాట్ సరస్సు వద్ద బర్డ్ వాచింగ్ ట్రైన్ ఏర్పాటు చేస్తారు.

Nirmala Sitharaman (Image Credit To Original Source)

  • ఏపీలో ప్రత్యేక మైనింగ్‌ మిషన్‌ ఏర్పాటు
  • ప్రపంచస్థాయి కంటెయినర్‌ ఉత్పత్తి కార్పొరేషన్‌
  • తెలంగాణకు హై స్పీడ్ రైల్ కారిడార్స్

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పలు కేటాయింపులు జరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో కేంద్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఏమేం దక్కాయో చూడండి..

ఏపీకి కేటాయించినవి..

  • రేర్ ఎర్త్ కారిడార్
  • ఏపీలో ప్రత్యేక మైనింగ్‌ మిషన్‌ ఏర్పాటు. ప్రపంచస్థాయి కంటెయినర్‌ ఉత్పత్తి కార్పొరేషన్‌
  • అరకులో మౌంటెయిన్ ట్రైన్
  • పులికాట్ సరస్సు వద్ద బర్డ్ వాచింగ్ ట్రైన్
  • హైస్పీడ్ రైల్ కారిడార్ (హైదరాబాద్ – బెంగళూరు రూట్ ఏపీలో నుంచి వెళ్తుంది. హైదరాబాద్ – చెన్నై కూడా వయా ఏపీ నుంచే వెళ్తుంది)
  • కోస్తా తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు నాటే స్కీమ్. కాయలు కాయని కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి నాటుకోవడానికి ఇన్సెంటివ్స్
  • బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన రవాణా కారిడార్లలో ఒకటి ఏపీ నుంచే వెళ్లే అవకాశం
  • డేటా సెంటర్లు నెలకొల్పే వారికి 2047 వరకు ట్యాక్స్ ఫ్రీ కాబట్టి ఏపీకి మంచి అవకాశం
  • సెమీ కండక్టర్ 2.0 స్కీమ్ ద్వారా ఏపీలోని శ్రీ సిటీకి పెట్టుబడులు పెరిగే చాన్స్

Union Budget 2026: యాక్సిడెంట్‌ బాధితులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్‌

తెలంగాణకు కేటాయించినవి..

  • హై స్పీడ్ రైల్ కారిడార్స్
  • హైదరాబాద్ టు చెన్నై
  • హైదరాబాద్ టు బెంగళూరు
  • పూణె టు హైదరాబాద్
  • ఫ్రైట్ కారిడార్‌లో తెలంగాణకు చోటు దక్కే అవకాశం
  • హైదరాబాద్ మెడికల్ హబ్ కాబట్టి బయో ఫార్మా హబ్, మెడికల్ టూరిజంలో పెద్ద వాటా దక్కే అవకాశం
  • వరంగల్, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో మెగా టెక్స్ టైల్స్ పార్క్ లకు ప్రోత్సాహకాలు దక్కే చాన్స్
  • డేటా సెంటర్లు నెలకొల్పే వారికి 2047 వరకు ట్యాక్స్ ఫ్రీ కాబట్టి తెలంగాణకు మంచి అవకాశం