Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ..

Pawan Kalyan Vangaveeti Radhakrishna : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.

Vangaveeti Radhakrishna meets Jana Sena chief Pawan Kalyan

Pawan Kalyan Vangaveeti Radhakrishna : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైన వేళ ఓ ఆసక్తికర భేటీ చోటుచేసుకుంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం సాయంత్రం మంగళగిరిలోని పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో వీరి భేటీ జరిగింది.

Also Read : AP Local Body Elections : లోకల్ ఎలక్షన్స్‌పై పవన్ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి ఐదుగురు సభ్యుల కమిటీ!

ఇద్దరి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో ఈ భేటీ ఆత్మీయంగా సాగింది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించుకున్నారు.

అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా పవన్ కల్యాణ్, వంగవీటి రాధాకృష్ణ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు మాట్లాడుకున్నట్లు సమాచారం. అదేవిధంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల్లో చేపడుతున్న మార్పులు, సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లు జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.