ఎంత దారుణం.. కనకదుర్గమ్మ బంగారం కొట్టేయడానికి.. ప్లాన్ మొత్తం బయటపడిందిలా..

Vijayawada Durga Gudi : విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో ఆలయ సిబ్బంది చేతివాటం తెరపైకి వచ్చింది.

vijayawada indrakeeladri temple Staff members allegedly attempted to divert gold

Vijayawada Durga Gudi : ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ గుడిలో పని చేస్తోన్న సిబ్బంది చేతివాటం మరోసారి బయటపడింది. భక్తులు హుండీలో సమర్పించిన బంగారాన్ని దారిమళ్లించే ప్రయత్నం చేశారు. అయితే తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.

తాజాగా కొందరు దుర్గగుడి సిబ్బంది హుండీ లెక్కింపులో బంగారాన్ని దారిమళ్లించేందుకు ప్రయత్నించారు. అసలు బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్ పెట్టి నొక్కేద్దామని ప్రయత్నించారు. అయితే ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో.. వారు సిబ్బందిని తనిఖీ చేయించారు. ఈ సోదాల్లో సిబ్బంది అడ్డంగా బుక్కయ్యారు. వీరి వద్ద నుంచి ఇప్పటికే రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దుర్గగుడి ఈఓ (EO) శీనా నాయక్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.