Chandrababu on YCP: ఎప్పుడు ఎన్నికలు జరిగినా, చిత్తుగా ఓడుతారు.. వైసీపీపై చంద్రబాబు జోస్యం

రాష్ట్రంలో వైకాపా విధానాల వల్ల యావత్తు రాష్ట్రం ఇదేం ఖర్మ అని ఆవేదన చెందుతోందని అన్నారు. 13వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, జగన్ విధానాలతో అటు రాష్ట్రం, ఇటు వ్యక్తిగతంగా ప్రజలు అప్పుల పాలయ్యారని దుయ్యబట్టారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నా ప్రభుత్వం కనీస మాత్రమైనా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu on YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్ఆర్‭సీపీ చిత్తుగా ఓడుతుందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వాస్తవానికి ఈ విషయం జగన్‭కు అర్థమైందని, ప్రస్తుతం ఆయనలో ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. ఇందుకోసం ముందస్తు ఆలోచనలో జగన్ ఉన్నట్లు వెల్లడించిన చంద్రబాబు, వచ్చే ఏడాది మే లేదంటే అక్టోబరులో ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని చంద్రబాబు జోస్యం చెప్పారు. సీఎం జగన్ నిర్ణయాల వల్ల ఇటు రాష్ట్రం, అటు వ్యక్తిగతం ప్రజలు అప్పులపాలయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Supreme Court Advocate joined TMC : తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది

బుధవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా విధానాల వల్ల యావత్తు రాష్ట్రం ఇదేం ఖర్మ అని ఆవేదన చెందుతోందని అన్నారు. 13వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, జగన్ విధానాలతో అటు రాష్ట్రం, ఇటు వ్యక్తిగతంగా ప్రజలు అప్పుల పాలయ్యారని దుయ్యబట్టారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నా ప్రభుత్వం కనీస మాత్రమైనా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Cyber Criminals Cheating : సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం.. రిటైర్డ్ ప్రిన్సిపాల్ అకౌంట్ నుంచి రూ. 7.25 లక్షలు మాయం

ట్రెండింగ్ వార్తలు