Special Train : ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు.. ఆగే స్టేషన్లు ఇవే..

Special Train : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. చర్లపల్లి - అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది.

Special Train : ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు.. ఆగే స్టేషన్లు ఇవే..

Special Train

Updated On : September 11, 2025 / 9:09 PM IST

Special Train : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని నిర్ణయించింది.

Also Read: 7th Pay Commission : 7వ వేతన సంఘం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళికి ముందే బంపర్ గిఫ్ట్.. అక్టోబర్ నుంచే జీతాల పెంపు..?!

చర్లపల్లి – అనకాపల్లి మధ్య సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే, ఈ రైళ్లు ఏ సమయానికి బయలుదేరుతాయనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ప్రత్యేక రైళ్లు.. ఆగే స్టేషన్లు..

♦ చర్లపల్లి – అనకాపల్లి రైలు (07035) సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతి శనివారం నడుస్తుంది.
♦ అనకాపల్లి – చర్లపల్లి రైలు (07036) సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
♦ ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతోపాటు స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.
♦ ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతాయి.