Special Train
Special Train : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని నిర్ణయించింది.
చర్లపల్లి – అనకాపల్లి మధ్య సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే, ఈ రైళ్లు ఏ సమయానికి బయలుదేరుతాయనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
♦ చర్లపల్లి – అనకాపల్లి రైలు (07035) సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతి శనివారం నడుస్తుంది.
♦ అనకాపల్లి – చర్లపల్లి రైలు (07036) సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
♦ ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతోపాటు స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.
♦ ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతాయి.
Special trains between #Charlapalli and #Anakapalli @drmsecunderabad @drmvijayawada #festival pic.twitter.com/m443jhmUYh
— South Central Railway (@SCRailwayIndia) September 11, 2025