Andhra Pradesh : ఏపీ ప్రజలను వణికిస్తున్న అక్టోబర్.. ఓగ్ని తుపాన్ నుంచి అర్నబ్ వరకు.. ఎందుకిలా?
Andhra Pradesh : గత రెండు దశాబ్దాల్లో అనేక తుపాన్లు ఏపీని ముంచెత్తాయి. వీటిలో ఎక్కువ తుపాన్లు అక్టోబర్ నెలలోనే రావడం విశేషం.
- Harish Thanniru
- Published on- October 29, 2026 / 08:39 AM IST
Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలో అర్నబ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ప్రభావం ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్రంగా పడింది. ఉత్తరాంధ్ర జిల్లాలపైనా తుపాను ప్రభావం చూపింది. భీకర గాలులు, వర్షాలతో వేలాది వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. అయితే, అక్టోబర్ నెల వస్తుందంటేనే ఏపీలోని తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఓగ్ని తుపాను నుంచి ప్రస్తుతం అర్నబ్ తుపాను వరకు అక్టోబర్ నెలలోనే రావడంతో ఈనెల వస్తుందంటే ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
Also Read : School Holidays : అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
గత రెండు దశాబ్దాల్లో అనేక తుపాన్లు ఏపీని ముంచెత్తాయి. వీటిలో ఎక్కువ తుపాన్లు అక్టోబర్ నెలలోనే రావడం విశేషం. ఓగ్ని, ఫైలిన్, హుద్‌హుద్, తిత్లీ, మోంథా నుంచి నేటి అర్నబ్ వరకు ఏపీలోని తీర ప్రాంతాల ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిలిగ్చాయి. దీంతో అక్టోబర్ నెల వస్తుందంటే ఏపీలోని అనేక జిల్లాల ప్రజలు వణికిపోతున్న పరిస్థితి.
ఎప్పుడు ఏ తుపాను వచ్చిందంటే..?
♦ 2006 అక్టోబర్ 29, 30 తేదీల్లో ఒగ్ని తుపాను దక్షిణ కోస్తా ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపింది.
♦ 2013 అక్టోబర్ 12న ఫైలిన్ తుపాను ఉత్తరాంధ్రపై ప్రభావం చూపింది. భారీ వర్షాలతోపాటు పెనుగాలులు వీచాయి. తీవ్ర నష్టం వాటిల్లింది.
♦ 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను బీభత్సం సృష్టించింది. ఉత్తరాంధ్ర చరిత్రలో అత్యంత విధ్వంసకర తుపానల్లో ఒకటిగా నిలిచింది.
♦ 2018 అక్టోబర్ 11 తిత్లీ తుపాను ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలపై ప్రభావం చూపింది. ఈ తుపాను కారణంగా భారీగానే నష్టం వాటిల్లింది.
♦ 2025 అక్టోబర్ 28, 29 తేదీల్లో ఏర్పడిన మెంథా తుపాను కారణంగా కోస్తాంధ్రలో బలమైన గాలులతో భారీ వర్షాలు కురిశాయి.
♦ 2026 అక్టోబర్ 27, 28 తేదీల్లో అర్నబ్ తుపాన్ కోస్తా జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. ఉత్తరాంధ్ర జిల్లాలపై కూడా ప్రభావం చూపింది. ఈ తుపాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది.
అక్టోబర్ నెలలోనే తుపాన్లు బెడద ఎందుకు?
నైరుతి రుతుపవనాలు తిరోగమించే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణంలోని గాలుల స్వభావం వంటి అంశాలు అనుకూలిస్తే అవి తుపాన్లుగా బలపడే అవకాశం ఉంటుంది. అక్టోబరు, నవంబరు నెలలు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోపాటు తుపాన్లకు కీలకమైన కాలం. అందుకే ఈ సమయంలో తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అయితే, అక్టోబర్ నెలలోనే అత్యధిక తుపాన్లు వస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
