Wild Jungle Chicken : కోడి పుంజు ఖతర్నాక్ ఉందని.. కోసి కూర వండుదామనుకున్నారేమో.. జైలుకు వెళ్తారు జాగ్రత్త..!

Wild Jungle Chicken : మాంసం ప్రియులకు అలర్ట్.. ఈ కోడిని కోసి తింటే జైలుకు వెళ్తారు.

wild jungle fowl hunting this chicken will result in prison sentence

Wild Jungle Chicken : కోడి కూర.. అందునా నాటు కోడి అంటే మన తెలుగు వారు లొట్టలేస్తారు. సిటీల్లో ఉండే వాళ్లు గ్రామాలకు వెళ్తే తప్పకుండా నాటు కోడి కూర తింటారు. మేక మాంసానికి ఎంత డిమాండ్ ఉంటుందో నాటు కోడి కూరకు కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ధర కూడా రూ.500 వరకు ఉంటుంది. చాలా మంది గ్రామాల్లో నాటు కోళ్లను పెంచుతూ ఆదాయం పొందుతుంటారు. మరి మీరు కూడా నాటు కోడి మాంసం ప్రియులు అయితే ఈ వార్త తప్పకుండా చదవండి. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే కోడి పుంజు మామూలిది కాదు. దీన్ని కనుక తిన్నారంటే నేరుగా జైలుకే పోతారు. తస్మాత్ జాగ్రత్త.. ఎందుకో తెలియాలంటే..

కోడిని కోసి కూర వండుకుని తింటే జైలుకు వెళ్తారా.. ఇప్పటి వరకు రోజూ తింటూనే ఉన్నాం కదా.. ఈ కోడిని తింటే మాత్రం ఎందుకు జైలుకు వెళ్తాం అంటే.. ఇది సాధారణంగా గ్రామాల్లో తిరిగే మామూలు కోడి పుంజు కాదు. అడవిలో మాత్రమే నివసించే అడవి కోడి. దీన్ని ఆంగ్లంలో గ్రే జంగిల్‌ ఫౌల్‌ అని పిలుస్తారు. ఇది కేవలం మన దేశ అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. అరుదైన జాతికి చెందినది కాబట్టి.. ప్రభుత్వం దీన్ని వన్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చింది.

ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఈ అడవి కోళ్లను వేటాడితే జరిమానాతోపాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. ఇక ఈ కోళ్ల విషయానికి వస్తే.. ఇవి కేవలం అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి నేల మీద తిరుగుతాయి. ఏ చిన్న అలికిడైనా సరే.. వెంటనే పారిపోయి చెట్లపైకి ఎగురుతాయి. ఈ కోళ్లు గింజలు, చెదలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ కోళ్లు సాధారణంగా ఏపీ, తెలంగాణ అడవుల్లో కూడా కనిపిస్తాయి. ఈ కోళ్లు అడవుల్లో స్వేచ్ఛగా జీవించే వన్య ప్రాణులు. భారతదేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి.

ఈ కోళ్లు పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని వేటాడటం, పట్టుకోవడం, చంపడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అలానే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి కోళ్లను వేటాడటం నేరం. వీటిని పట్టుకోవడం, విక్రయించడం, మాంసం నిల్వ ఉంచడం కూడా చట్ట విరుద్ధం. నేరం నిరూపితమైతే జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. శిక్ష తీవ్రత కేసు స్వభావాన్ని బట్టి మారవచ్చు.