నేటితో ముగియనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

  • Publish Date - December 17, 2019 / 02:58 AM IST

ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు హీట్ పుట్టిస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీన మొదలైన సమావేశాలు నేటితో(17 డిసెంబర్ 2019) ముగియనున్నాయి. ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును, అలాగే దిశ బిల్లును సభలో ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. రాష్ట్రంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, అప్రకటిత విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగనుంది.

నూతన మద్యం విధానం, రాజధాని నిర్మాణంపై అసెంబ్లీలో ఇవాళ కాసేపు చర్చ జరగనుంది. నిన్న అసెంబ్లీలో ఆమోదించిన 16 బిల్లులను శాసన మండలిలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇవాళ శాసనమండలిలో అమరావతి నిర్మాణంపై చర్చ కొనసాగనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ జరగనుంది.