Anil Kumar Yadav : నారాయణ బినామీ ఆస్తులపై ఆమెను విచారించాలి.. వాళ్ల దగ్గర వందలకోట్లు దోచుకున్నాడు
మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..
- Harishth Thanniru
- Updated on- October 5, 2023 / 04:03 PM IST
MLA Anil Kumar Yadav
YCP MLA Anil Kumar Yadav : మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల ప్రక్రియ మీద టీడీపీ మోసాలకు పాల్పడుతుందని విమర్శించారు. ”నారాయణ కాలేజీని అడ్డం పెట్టుకొని వందలాది ఓట్లు చేర్చుకుంటూ.. మాపై బురద చల్లుతున్నారు. ఓట్లు తొలగిస్తున్న అసలు దొంగలు టీడీపీ వాళ్లే. ఓట్ల తొలగింపు చేపడుతున్న నారాయణ కాలేజ్ స్టాఫ్ పై అవసరమైతే కేసులు పెట్టిస్తామని” అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
వైసీపీకి బలమైన కొన్ని ప్రాంతాల్లో మా ఓట్లు టీడీపీ తొలగిస్తుంది. బతికున్న వారిని చనిపోయినట్లు చూపించి ఓట్లు డిలీట్ చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. స్పష్టమైన ఆధారాలతో సీఐడీ విచారణకు రమ్మని తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే నారాయణకు.. విచారణకు వెళ్లే ఓపిక లేదా అంటూ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. సర్జరీలు జరిగాయని అబద్ధాలు చెబుతూ.. కోర్టులను మాజీ మంత్రి నారాయణ మోసం చేస్తున్నారని అన్నారు.
Read Also : మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ ఒక స్త్రీ విజయం వెనుక..
నారాయణ బినామీ ఆస్తులపై ఆయన మరదలు ప్రియని విచారించాలని కోరారు. నారాయణ వైట్ కాలర్ క్రిమినల్ అని.. రైతుల దగ్గర నుంచి వందల కోట్లు దోచుకున్నాడంటూ అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
Also Read: వారి కలయిక పాయిజన్ తో సమానం.. టీడీపీని కాపులు క్షమించరు
