YS Sharmila : విజయమ్మ లేఖపై వైఎస్ షర్మిల క్లారిటీ.. జగన్‌కు సూటి ప్రశ్న.. వైసీపీ నేతల వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్

YS Sharmila : విజయమ్మ లేఖను కూడా ఫేక్ అంటున్నారు. లెటర్ మీద విజయమ్మ సంతకం పెట్టలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లేఖ నిజం కాకపోతే విజయమ్మ చెప్పేది కదా?.. లేఖకు నాకు సంబంధం లేదని చెప్పేది కదా? చెప్పలేదు అంటే లేఖ నిజమే కదా.

YS Sharmila

  • వైసీపీ నేతల వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఆగ్రహం
  • వివేకా హత్య కేసు ప్రస్తావిస్తే.. ఆస్తుల గురించి ఎందుకు?
  • నా పోరాటం, అజెండా ఆస్తులు కాదు
  • ఆస్తులే నా అజెండా అయితే కోర్టుకెళ్లేదాన్ని

YS Sharmila : మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావిస్తే.. ఆస్తుల గురించి మాట్లాడుతున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ నేతలపై మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ లేఖపై స్పందించారు.

Also Read : Iran vs Israel War : యుద్ధానికి విరామం.. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. ఇరాన్ ఏమన్నదంటే?

వివేకా హత్య‌ను అవినాష్ రెడ్డి తప్పుదారి పట్టించాడు.. గుండెపోటు కట్టుకథ. ఇదే గుండెపోటు కట్టుకథ‌ను సునీత మీద నెట్టాలని చూశారని షర్మిల అన్నారు.  నేను హత్య అంటే .. వైసీపీ నేతలు ఆస్తులు అంటున్నారు. వివేకా హత్య మీద సమాధానం చెప్పే దమ్ము వైసీపీకి లేదా అంటూ షర్మిల ప్రశ్నించారు. అసలు నిజం ఏంటో చెప్పాల్సింది జగన్, భారతి. వీళ్ళు చెప్పలేక నా మీద అపనింధలు వేస్తున్నారు. నేను, సునీత చంద్రబాబుతో చెయ్యి కలిపామని సృష్టించారు. నా పోరాటం ఆస్తులు కాదు.. నా ఆరాటంలో ఆస్తుల అంశం అజెండాగా లేదు. ఆస్తుల కోసం కోర్టుకి వెళ్ళింది నేను కాదు.. ఎంఓయూను నేను బహిర్గత పరచలేదని షర్మిల చెప్పారు.

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారాల్సిన అవసరం నాకు లేదు. జగన్ లాగా నాకు స్వార్థ రాజకీయాలు తెలియదు. వేరే వాళ్ల ఆస్తులు అనుభవించాల్సిన దుస్థితి నాకు లేదు. రాజకీయాల కోసం బీజేపీతో దత్త పుత్రుడుగా నేను మారలేదు.  వైఎస్  విజయమ్మ వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య. వైఎస్ఆర్‌లో సగం విజయమ్మ. ఆమె లేఖ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్తులు సగభాగం అని చెప్పింది. నలుగురు మనుమలకు సమానంగా ఆస్తి పంపిణీ జరగాలని చెప్పింది. ఇది వైఎస్ఆర్ ఆదేశంగా కూడా విజయమ్మ లేఖలో పేర్కొంది. నేను రాసింది దేవుడి సాక్షిగా నిజమే అని చెప్పింది. ఆస్తుల విషయంలో గోబెల్స్ ప్రచారం చేయొద్దని చెప్పింది. వైసీపీలో సంస్కారం ఉన్న వాళ్లకు ఎవరికైనా అర్థం అవుతుంది. అయినా కూడా మాట్లాడుతున్నారు అంటే కుక్కలు మొరుగుతున్నాయి అనుకుంటాం అంతే అంటూ షర్మిల వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్సందించారు.

విజయమ్మ లేఖను కూడా ఫేక్ అంటున్నారు. లెటర్ మీద విజయమ్మ సంతకం పెట్టలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లేఖ నిజం కాకపోతే విజయమ్మ చెప్పేది కదా?.. లేఖకు నాకు సంబంధం లేదని చెప్పేది కదా? చెప్పలేదు అంటే లేఖ నిజమే కదా? లేఖ మీద జగన్ కి సమాధానం చెప్పే దమ్ములేక, వాళ్ల కుక్కలతో మొరిగిస్తున్నాడు అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.