YS Vijayamma : ‘హ్యాపీ బర్త్డే మా..’ అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు.. వైఎస్ జగన్, షర్మిల
‘హ్యాపీ బర్త్డే అమ్మా..’ అంటూ వైఎస్ జగన్ ట్విట్టర్ (X) వేదికగా విషెస్ తెలిపారు. తన తల్లితో పాటు దిగిన ఓ ఫొటోను ఆయన షేర్ చేశారు.
- Sreehari A
- Updated on- April 19, 2024 / 04:04 PM IST
YS Jagan and YS Sharmila birthday wishes to their mother ys vijayamma
YS Vijayamma : దివంగత నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ జన్మదినం సందర్భంగా ఆమె కుమారుడు, కుమార్తె అయిన వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్డే అమ్మా..’ అంటూ వైఎస్ జగన్ ట్విట్టర్ (X) వేదికగా విషెస్ తెలిపారు. తన తల్లితో పాటు దిగిన ఓ ఫొటోను ఆయన షేర్ చేశారు.
అలాగే, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తల్లి విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు.
నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనఃశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్ డే మా’ అని షర్మిల ట్వీట్ చేశారు.
మరోవైపు ఏపీలో ఎన్నికల వేళ.. వైఎస్ విజయమ్మ అమెరికాలోని తన మనవడు, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వద్దకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సందర్భంగా కుమారుడు జగన్, కుమార్తె షర్మిల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
