జగన్ అనే నేను 2 నెలల్లో మళ్లీ మీ ముందుకు..: సీఎం జగన్

చంద్రబాబు నాయుడు సీఎంగా పనిచేసిన సమయంలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని జగన్ ప్రశ్నించారు.

జగన్ అనే నేను 2 నెలల్లో మళ్లీ మీ ముందుకు..: సీఎం జగన్

YS Jagan

‘జగన్ అనే నేను 2 నెలల్లో మళ్లీ మీ ముందుకు సీఎంగా వస్తా’నని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దారి ఎప్పటికీ అడ్డదారేనని చెప్పారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు సీఎంగా పనిచేసిన సమయంలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల వేళ బాబు సూపర్ 6 అంటే నమ్ముతారా? అని అన్నారు. చంద్రబాబు నాయుడు ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు.

పేదల బంగారు భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయని విమర్శించారు. ఇవి జగన్‌కు, చంద్రబాబు నాయుడికి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదని చెప్పారు. ప్రజలకు, చంద్రబాబు నాయుడి మోసాలకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం చేసిన పనులన్నీ ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం దోచుకోవడం కోసం అధికారాన్ని వాడుకున్నారని చెప్పారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలతో పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.

రేవంత్ రెడ్డికి మంత్రివర్గం సహకరించడం లేదు.. అందుకే ఆయన ఇలా..: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్