రేవంత్ రెడ్డికి మంత్రివర్గం సహకరించడం లేదు.. అందుకే ఆయన ఇలా..: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

Palvai Harish: తెలంగాణలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఐదు గ్యారెంటీలపై చేతులెత్తేశారని పాల్వాయి హరీశ్ అన్నారు.

రేవంత్ రెడ్డికి మంత్రివర్గం సహకరించడం లేదు.. అందుకే ఆయన ఇలా..: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ మంత్రివర్గం సహకరించడం లేదని, అందుకే ఆయన ఇలా అభద్రతా భావంతో ఉన్నారని సిర్పూర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత పాల్వాయి హరీశ్ అన్నారు. త్వరలోనే నల్లగొండ నేతలంతా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలను దమ్ముంటే టచ్ చేసి చూడాలని అన్నారు.

తెలంగాణలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఐదు గ్యారెంటీలపై చేతులెత్తేశారని పాల్వాయి హరీశ్ అన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పారు. పోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరపాలని అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న డీజీపీకి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటల్లోనే డొల్లతనం కనిపిస్తోందని చెప్పారు.

కాగజ్‌నగర్‌లోకి అడవి ఏనుగు వచ్చి ఒక వ్యక్తిపై దాడి చేస్తుంటే పట్టించుకునే అధికారులు లేరని సిర్పూర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత పాల్వాయి హరీశ్ అన్నారు. అనేక క్రూరమృగాలు వస్తున్నాయని తెలిపారు. గతంలోనూ పులుల దాడులతో ముగ్గురు చనిపోయారని తెలిపారు. అసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని అన్నారు.

పది లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి కొండా సురేఖ ప్రకటించారని అన్నారు. మరణించిన కుటుంబానికి మహారాష్ట్రలో ఇస్తున్నట్లు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వన్యప్రాణుల నుంచి ఉన్న ముప్పు నుంచి ప్రజలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.

స్మగ్లింగ్ కేస్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు.. హర్షకు కస్టమ్స్‌ అధికారుల నోటీసులు