స్మగ్లింగ్ కేస్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు.. హర్షకు కస్టమ్స్ అధికారుల నోటీసులు
Ponguleti: ఒక్కో వాచ్ విలువ 1.75 కోట్ల రూపాయలు ఉంటుంది. హవాలా రూపంలో వాచ్..

Ponguleti Srinivasa Reddy, Ponguleti Harsha
స్మగ్లింగ్ కేస్‌లో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పొంగులేటి హర్షా రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బ్రాండెడ్ వాచ్ లో స్మగ్లింగ్ కేసులో పొంగులేటి హర్ష రెడ్డి విచారణకు రావాలని చెప్పారు.
తాను డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నట్టు రిప్లై ఇచ్చారు హర్షారెడ్డి. ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ముబిన్ అనే స్మగ్లర్ నుంచి రెండు బ్రాండెడ్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు. పటెక్ ఫిలిప్, బ్రిగట్ వాచ్ లను హర్షా రెడ్డి కోసం సింగపూర్ నుంచి ముబిన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఒక్కో వాచ్ విలువ 1.75 కోట్ల రూపాయలు ఉంటుంది. హవాలా రూపంలో వాచ్ కు హర్ష రెడ్డి డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముబిన్, హర్ష రెడ్డి డీల్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాడు నవీన్ కుమార్ అనే వ్యక్తి. నవీన్ కుమార్ ను సైతం విచారించారు కస్టమ్స్ అధికారులు. స్మగ్లింగ్ వాచ్ ల కుంభకోణం 100 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని కస్టమ్స్ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 5న కేసు నమోదు చేసింది కస్టమ్స్.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అనంతలోకాలకు.. ఈ ఏడాదిలోనే 10 మంది..