ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అనంతలోకాలకు.. ఈ ఏడాదిలోనే 10 మంది..

వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వివిధ ప్రదేశాల్లోని కాన్సులేట్లు.. అమెరికాలోని భారతీయ విద్యార్థులతో వర్చువల్‌గా సమావేశమైంది.

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అనంతలోకాలకు.. ఈ ఏడాదిలోనే 10 మంది..

Indian student

చదువుల కోసం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి.. శవమై ఇంటికి వస్తున్నారు కొందరు భారత విద్యార్థులు. అమెరికాలో వరుసగా భారత విద్యార్థులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ప్రమాదాల్లో మరణిస్తే..ఇంకొందరు హత్యలకు గురయ్యారు. మరికొందరు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు.

తాజాగా అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గద్దె ఉమా సత్యసాయి అనే యువకుడు అగ్రరాజ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో చదువుతున్న గద్దె ఉమా సత్యసాయి మృతిచెందాడని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ అధికారికంగా ప్రకటించింది. యువకుడి మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.

ఇప్పటికే 10 మంది
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. ఉన్నత చదువు చదివి అక్కడే పెద్ద ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలనే ఆశతో అమెరికాకు వెళ్లి అనంతలోకాలకు వెళ్లిపోతుండటం.. తల్లిదండ్రులకు విషాదం మిగుల్చుతుంది. ఎన్నో ఆశలతో ఖండాలు దాటి వెళ్తున్న యువత కలలు మధ్యలోనే చెరిగిపోతున్నాయి.

ఈ ఏడాదిలోనే అమెరికాలో పదిమంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో క్లాసికల్ డ్యాన్సర్ అమర్‌నాథ్‌ ఘోష్‌ను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో తుపాకీతో కాల్చి హత్యచేశారు. మార్చిలోనే మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే మరో భారతీయ విద్యార్థి క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. డబ్బు చెల్లిస్తే అతడిని విడుదల చేస్తామంటూ కుటుంబానికి బెదిరింపు కాల్ వచ్చింది.

చికాగోలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి
ఈ ఏడాది మొదట్లో చికాగోలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి సయ్యద్ అలీపై దుండగులు దాడి చేశారు. ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో విద్యార్థి నీల్ ఆచార్య అనుమానస్పద రీతిలో చనిపోయాడు. జార్జియాలో వివేక్ సైనీ హత్య తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. వరంగల్‌ జిల్లాకు చెందిన వెంకటరమణ, మరో తెలుగు విద్యార్థి అభిజిత్‌ పరుచూరి ఈ ఏడాదిలోనే అమెరికాలో మృతిచెందారు.

భారతీయులపై వరుస దాడులు జరుగుతున్న క్రమంలో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వివిధ ప్రదేశాల్లోని కాన్సులేట్లు.. అమెరికాలోని భారతీయ విద్యార్థులతో వర్చువల్‌గా సమావేశమైంది. విద్యార్థుల భద్రతతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఛార్జ్ డి అఫైర్స్ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ ఆధ్వర్యంలోని 90 US యూనివర్శిటీల నుంచి దాదాపు 150 మంది ఇండియన్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎన్ని రూపాయలో తెలుసా? రేట్లు ఎందుకు పెరిగాయి?