భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎన్ని రూపాయలో తెలుసా? రేట్లు ఎందుకు పెరిగాయి?

Chicken Price: చికెన్ ధరలు పెరగడంతో కొనేవారు తగ్గిపోతున్నారని వ్యాపారస్తులు అంటున్నారు.

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎన్ని రూపాయలో తెలుసా? రేట్లు ఎందుకు పెరిగాయి?

Chicken

Updated On : April 7, 2024 / 4:28 PM IST

చికెన్ ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో రెండు రోజులుగా రోజుకు 30 రూపాయల చొప్పున పెరిగింది. ప్రస్తుతం కిలో రూ.310గా ఉంది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్ష పండులాగా మారింది చికెన్. విశాఖలో కేజీ రూ.280 ధర పలుకుతోంది. వారం క్రితం రూ.200 ఉండగా ఇప్పుడు ఏకంగా 80 రూపాయలు పెరిగింది.

Chicken Biryani

చికెన్ ధరలు పెరగడంతో కొనేవారు తగ్గిపోతున్నారని వ్యాపారస్తులు అంటున్నారు. మధ్య తరగతి ప్రజలు చికెన్ కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో చికెన్ కిలో రూ.300కు చేరింది. కొన్ని రోజుల క్రితం రూ.200గా చికెన్ ధర ఉండేది.

ఉష్ణోగ్రతలు పెరగడంతో చికెన్ ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు అంటున్నారు. ఎండలకు ఫ్రౌల్టీల్లోని కోళ్లు చనిపోతున్నాయని వివరించారు. ఉత్పత్తి తగ్గి రేట్లు పెరిగినట్లు చెప్పారు. సమీప భవిష్యత్తులో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ వేడుకలకు కూడా భారీగా చికెన్ ఆర్డర్లు వస్తాయి.

OMAD For Weight Loss : బరువు తగ్గేందుకు రోజుకు ఒకపూట భోజనం.. ఆరోగ్య ప్రయోజనాలేంటి? నష్టాలేంటి?