AP Mega DSC: మెగా డీఎస్సీలో భారీ స్కామ్.. ఫస్ట్ ర్యాంకర్ కు జాబ్ ఎందుకు ఇవ్వలేదు? సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

YS Jagan DSC : డీఎస్సీ నిర్వహించిన విధానం షాకింగ్‌గా ఉందని వైఎస్ జగన్ అన్నారు. లక్షల మంది డీఎస్సీ (Mega DSC) అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఏపీ చరిత్రలో ఇలాంటి దారుణమైన రిక్రూట్మెంట్ జరగలేదు. తొలి సంతకం అయినా మెగా డీఎస్సీపైనే ఇలాంటి మోసాలకు పాల్పడ్డారంటూ జగన్ విమర్శించారు.

Ys Jagan Demand CBI Inquiry on AP Mega DSC

YS Jagan : ఏపీలో జరిగిన డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని, ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 16వేల పోస్టులకు అనేక అవకతవకలకు పాల్పడ్డారు. స్కాంలతో 16వేల పోస్టులు భర్తీచేసి పెద్ద రికార్డు అంటున్నారు. అసలైన రికార్డు అంటే మా హయాంలో ఒకే నోటిఫికేషన్ లో 1.30లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఎవరూ ఎప్పుడూ బద్దలు కొట్టలేని రికార్డు మేము సృష్టించామని వైఎస్ జగగన్ చెప్పుకొచ్చారు. అంత పెద్ద నోటిపికేషన్లో చిన్న తప్పు జరగకుండా నిర్వహించాం.. మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు చేసిన గోల్ మాల్ తో అభ్యర్ధులు అల్లాడిపోతున్నారని జగన్ అన్నారు.

Also Read : Bill Gates : జెఫ్రీ ఎప్‌స్టీన్ హామీలు నమ్మి మోసపోయా.. అతని పరిచయం వెనుక అసలు కథ చెప్పిన బిల్‌ గేట్స్‌..

డీఎస్సీ నిర్వహించిన విధానం షాకింగ్‌గా ఉందని వైఎస్ జగన్ అన్నారు. లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఏపీ చరిత్రలో ఇలాంటి దారుణమైన రిక్రూట్మెంట్ జరగలేదు. తొలి సంతకం అయినా మెగా డీఎస్సీపైనే ఇలాంటి మోసాలకు పాల్పడ్డారంటూ జగన్ విమర్శించారు. డీఎస్సీ స్కామ్ పై సీబీఐ విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీ, నిర్వహణ నుండే స్కామ్ మొదలైంది. ప్రశ్నాపత్రం తయారీ, నిర్వహణ ఒకరికే అప్పగించారు. ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారు. అక్కడ పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ వచ్చిందని జగన్ అన్నారు. ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు..? తప్పు జరిగిందని తెలిసే ఆయన డేటా మాయం చేసేశారని జగన్ ఆరోపించారు.

తప్పులు జరగకపోతే మెరిట్ లిస్టుల్లో మార్పులు ఎందుకు జరిగాయి..? పేపర్ లీకేజీ కచ్చితంగా జరిగినట్టే.. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరింది..? లీకేజీ పేపర్‌తో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి రాలేదన్నది వాస్తవం అయితే.. ఆ వ్యక్తి కోర్టుకి ఎందుకు వెళ్తాడు..? మీరు డేటా తొలగించి.. కాల్ లెటర్ ఇవ్వకపోతే.. వెరిఫికేషన్‌కి ఎలా వస్తాడు..? పేపర్ లీకేజీ వ్యవహారం బయటికి రాకుండా ఉండేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు..? అన్ని బయటికి రావాలి. అలాజరగాలంటే.. సీబీఐ విచారణ జరగాలి. సీఎం చంద్రబాబు, కొడుకు విద్యాశాఖ మంత్రి.. ఏపీ పోలీసుల విచారణలో నిజాలు బయటకేలా వస్తాయి..?
థర్డ్ పార్టీగా సిబిఐ విచారణ జరిగితేనే నిజాలు బయటికి వస్తాయని జగన్ అన్నారు.

స్పోర్ట్స్‌ కోటా అన్నది ఇంకో పెద్ద స్కాం. ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్‌ పర్సన్‌కు కూడా అన్యాయం జరిగిందని జగన్ అన్నారు. జీవో నంబర్‌ 4, జీవో నంబర్‌ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన “స్కామ్‌ల పాలసీ స్కెచ్‌’’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు ఎవ్వరూ DSC పరీక్ష రాయాల్సిన అవసరం లేదని, ఒక బ్యాక్‌డోర్‌ పెట్టి, ఆ బ్యాక్ డోర్‌ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, మీరు అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు, తెచ్చిన జీవోలను తీసేశారని జగన్ ఆరోపించారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, ఆర్చరీలో అతినికి, అనిగి దుర్గయ్య, పోలవరంలోని మారుమూల ప్రాంతంకు చెందిన వ్యక్తికి రాలేదు. 1:1 కాల్‌ లెటర్‌ అందుకున్న తర్వాత కూడా.

కచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం. క్రీడాకారుల పేరుతో చేసిన స్కాం కాదా ఇది అని జగన్ ప్రశ్నించారు. ముందు తన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా, జీవో నంబర్‌ 4, జీవో నంబర్‌ 47తో గేటు తెరిచారు. వాళ్లులోపలికి వెళ్లాక, జీవో నంబర్‌ 25, జీవోనంబర్‌ 56లతో గేటు మూసేశారు. తమ పని అయిపోయిన తర్వాత మళ్లీ ఆ జీవోను ఎత్తేశారు. మీరు ఇచ్చిన జీవో నంబర్‌ 4, జీవో నంబర్‌ 47 ఈరెండూ సరైనవే అయితే ఎందుకు మళ్లీ వాటిని తొలగించారు? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలడా? అని జగన్ ప్రశ్నించారు.