AP New Capital MAVIGUN : AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..ఎక్కడంటే..
YS Jagan New Capital Mavigon : మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించారు. ఇంతకు అది ఎక్కడుందంటే..
- Dharani Pilli
- Published On : April 1, 2026 / 01:22 PM IST
ys jagan propose ap capital between guntur machilipatnam and vijayawada suggest name as mavigon
- ఏపీకి కొత్త రాజధానిని ప్రతిపాదించిన జగన్
- విజయవాడ, గుంటూరు,మచిలీపట్నం ప్రాంతాలను కలిపి
- మావిగాన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేయండి
AP New Capital MAVIGUN : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదన్న జగన్.. తాము ప్రతిపాదించిన ప్లాన్ బి (Plan B) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధాని చేసి.. ‘మావిగన్’ అని పేరు పెట్టాలని సూచించారు. రాష్ట్రం కోసం ప్రాక్టికల్‌గా ఆలోచించే ఎవరికైనా తాము చెప్పేది అర్థమవుతుందన్నారు. ప్రాక్టికల్‌గా మేము చేసిన ఆలోచన మీకు నచ్చలేదని.. తాము ప్రతిపాదించిన ప్లాన్ బి గురించి కనీసం ఆలోచన చేయలేదన్నారు.
విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు అమరావతి కోసం అంచనా వేస్తున్న రెండు లక్షల కోట్లలో కేవలం 10 శాతం పెడితే.. భవిష్యత్తులో మంచి నగరం అవుతుందన్నారు. అక్కడ ఇప్పటికే 30-40 లక్షల మంది జనాభా ఉన్నారని.. నగరం మరింత పెరుగుతుందని తెలిపారు. రాజధానిగా జనసంచారం లేని అమరావతి ప్రాంతం ఎందుకని జగన్ ప్రశ్నించారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఈ మూడు నగరాలను కలిపి రాజధాని పెట్టాలని సూచించారు.
చంద్రబాబు గతంలోనే స్వార్థం లేకుండా ఆలోచన చేసి ఉంటే ఈపాటికి రాష్ట్రానికి రాజధాని ఉండేది. రాష్ట్రానికి ఇప్పుడు సత్వరమే గ్రోత్ ఇంజన్ లాంటి రాజధాని నగరం కావాలి. అది విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలిపి చేయబోయే నగరమే అవుతుందన్నారు. కొత్తగా ఏర్పడే నగరానికి ‘మావిగన్’ అని పేరు పెట్టాలని సూచించారు.
