×
Ad

అందుకే ఈ నకిలీ మద్యం మాఫియా బయటికి వచ్చింది: వైఎస్ జగన్ సంచలన కామెంట్స్‌

ఆర్గనైజ్డ్‌గా నేరాలు చేయడం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు అలవాటేనని తెలిపారు.

Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన ఫేక్ లిక్కర్‌ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్‌ రావు లొంగిపోతాడని మీడియాలో ముందుగా ఎలా వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ఇవాళ తాడేపల్లిలో జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

“రాష్ట్రంలో వ్యవస్థీకృత పద్ధతిలో నకిలీ మద్యం మాఫియా ఉంది. ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం తయారుచేస్తున్నారు. బెల్ట్, పర్మిట్ రూమ్స్ తో పాటు వైన్ షాపుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బుల కోసం నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. వాటాల్లో తేడాలు రావడంతో ఈ నకిలీ మద్యం మాఫియా బయటికి వచ్చింది” అని అన్నారు. (Fake Liquor Case)

Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 321 సెట్ల నామినేషన్లు.. ఎన్ని ఆమోదం పొందాయంటే? ఎం3 వెర్షన్ ఈవీఎంలతో ఓటింగ్

నిందితులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు జరిగాయని జగన్ అన్నారు. ఆర్గనైజ్డ్‌గా నేరాలు చేయడం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు అలవాటేనని తెలిపారు. ఆఫ్రికాలో మూలలు ఉన్నాయంటూ టీడీపీ సామాజిక మాధ్యమాల్లో బిల్డప్పుల ఇస్తోందని అన్నారు.

నిందితుడితో మాజీ మంత్రి జోగి రమేశ్‌ పేరును కూడా చెప్పించారని జగన్ ఆరోపించారు. మొలకల చెరువులోనే ఏకంగా 20,000 లీటర్ల నకిలీ మద్యం బయటపడిందని అన్నారు. కల్తీ లిక్కర్‌ మాఫియాలో టీడీపీ వాళ్లే ఉన్నారని చెప్పారు.

అంతా చేయిస్తున్నది చంద్రబాబేనని అన్నారు. టాపిక్‌ను డైవర్ట్‌ చేయడానికి నిందను వేరే వారికి మీద వేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు విజయవాడ సీపీ వింటున్నారని అన్నారు.

ఉద్యోగుల ఇష్యూపై జగన్ మాట్లాడుతూ.. “ఉద్యోగుల విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారు. నాలుగు డీఏలు పెండింగులో ఉంటే ఒక్కటి ప్రకటించారు.. ఇంతవరకూ ఇవ్వలేదు. డీఏ, ఏరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తామంటున్నారు.. దారుణం కాదా..? రిటైర్ అయ్యాకా డీఏ ఇవ్వడం చరిత్రలో ఎక్కడ జరగలేదు. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లల్లో 11 డీఏలు ఇచ్చాం” అని అన్నారు.