YS Jagan : ఏపీలో రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యమేలుతోంది.. పవన్, చంద్రబాబుపై వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్..

YS Jaga : ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, రాష్ట్రంలో ప్రస్తుతం 'రూల్ ఆఫ్ లా' స్థానంలో 'రూల్ ఆఫ్ ఫియర్' కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు.

YS Jagan

YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, రాష్ట్రంలో ప్రస్తుతం ‘రూల్ ఆఫ్ లా’ స్థానంలో ‘రూల్ ఆఫ్ ఫియర్’ కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం జగన్ మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు,పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Also Read : Venezuela Red Sky : వెనెజువెలాలో భయానక దృశ్యం.. నెత్తుటి రంగులోకి మారిన ఆకాశం.. ఆందోళనలో స్థానికులు.. వీడియో వైరల్..

రెండేళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు గుర్తుకొచ్చేవని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలో రెడ్‌బుక్ రాజ్యాంగం, కస్టోడియల్‌ డెత్స్‌, తర్వాత శవాలను మాయం చేయడం మొదలు, పాలన అంటే మోసాలు, అబద్ధాలు, ప్రజలకు వెన్నుపోట్లు అని చెప్పుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని జగన్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం జరుగుతుందనే నమ్మకం పూర్తిగా పోయిందని, ప్రజలు పోలీసులను చూసి భయపడే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని వైఎస్ జగన్ విమర్శించారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగడవం లేదని, తన పాలనపై ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

విజయవాడకు చెందిన సాయికృష్ణ కేసు, పోలీసుల వేధింపులకు బలైన క్రాంతి కుమార్ కేసు, కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్, తెనాలి తిరుపతమ్మ కేసు, శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన కళావతి ఘటనలను ప్రస్తావించిన జగన్.. ఇవన్నీ రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్ధం పడుతున్నాయని అన్నారు. సాయికృష్ణను కస్టడీలో దారుణంగా కొట్టి చంపి, అనంతరం శవాన్ని కూడా మాయం చేశారని, డీఎన్ఏ ఆనవాళ్లు కూడా దొరకకుండా దహనం చేశారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కుటుంబ షభ్యులకు బూడిద కూడా ఇవ్వకుండా అత్యంత అమానవీయంగా వ్యవహరించారని జగన్ విమర్శించారు.

ఈ ఘటనలో రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన అధికారులు ప్రమేయం ఉందన్న ఆరోపణలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని జగన్ అన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రశ్నిస్తే, క్రిమినల్స్‌కు మద్దతు ఇస్తున్నారని ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. సాయికృష్ణను మొదట రౌడీషీటర్‌గా పేర్కొన్న ప్రభుత్వం, ప్రజల ఆగ్రహం వ్యక్తమవడంతో యూటర్న్ తీసుకుని కుటుంబ సభ్యులను సచివాలయానికి పిలిపించుకుందని జగన్ విమర్శించారు. ఆ కుటుంబానికి చంద్రబాబు న్యాయం చేస్తానంటే.. ఏం న్యాయం చేస్తున్నాడో చెప్పాలికదా? అని జగన్ అన్నారు. ఏకంగా 46 రోజులపాటు ఇది బయటకు రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్‌ దేశం దిగ్భ్రాంతికి గురైతే, అసలు ఏం జరిగిందో, చట్టప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దలమీద, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అంటూ జగన్ ప్రశ్నించారు. ఇంత జరిగినా చంద్రబాబులో నిజాయితీగాని, చిత్తశుద్ధికాని ఏకోశాన లేదని జగన్ అన్నారు.

సాయికృష్ణ కేసు రిమాండ్‌ రిపోర్టు చూసినా.. వీళ్లు చేస్తున్న దర్యాప్తు తీరును చూసినా.. కేసును వీక్‌చేసి ఎలా నడుపుతున్నారో.. పైవాళ్లను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా బయటపడుతోందని జగన్ అన్నారు. సాయికృష్ణని మార్కాపురం నుంచి తీసుకు వచ్చింది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అని రిమాండ్‌ రిపోర్టులో చెప్పారు. వాళ్లు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించిన తర్వాత అకనాలెడ్జ్‌మెంట్‌ కూడా తీసుకున్నారని చెప్పారు. మరి టాస్క్‌ఫోర్స్‌ పనిచేసేది పోలీస్‌ కమిషనర్‌ కింద. మరి పోలీసు కమిషనర్‌ను ఎందుకు విచారించరు? అంటూ జగన్ ప్రశ్నించారు.