Thopudurthi Prakash Reddy : వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు అరెస్ట్.. వైసీపీ శ్రేణుల ఆగ్రహం
Thopudurthi Prakash Reddy : వైసీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రాజశేఖర్ రెడ్డి అరెస్టు ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాప్తాడు వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
- Harish Thanniru
- Published on- May 26, 2026 / 01:56 PM IST
YSRCP leader Topudurthi Prakash Reddy brother Rajasekhar Reddy arrested
Thopudurthi Prakash Reddy : వైసీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 2025లో రైలు పట్టాలపైపడి ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి అనే యువకుడు మృతిచెందాడు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులు బెదిరించడం వల్లనే నా కుమారుడు మృతిచెందాడని పేర్కొంటూ మహేశ్వరరెడ్డి తండ్రి తోపుదుర్తి మల్లిరెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో మహేశ్వర రెడ్డి హత్య కేసులో రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read : Thalliki Vandanam : బిగ్ అలర్ట్.. తల్లికి వందనం కింద రూ.13వేలు రావాలంటే వెంటనే ఇలా చేయండి..
మంగళవారం తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో ఇంట్లోఉన్న తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనపై 108 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను కోర్టులో హాజరపర్చనున్నారు.
అయితే, రాజశేఖర్ రెడ్డి అరెస్టు ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాప్తాడు వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి ఇటీవల గన్‌మెన్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆయన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిన పోలీసులు అరెస్టు చేశారని.. ఇదంతా చూస్తుంటే రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని స్పష్టమవుతోందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.
