GHMC ఎన్నికలకు వైసీపీ దూరం

  • Publish Date - November 19, 2020 / 06:39 PM IST

YSRCP not contesting in GHMC Elections : త్వరలో జరగబోయే హైదరాబాదా నగరపాలక సంస్ధ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోవటంలేదని ప్రకటించింది. ఈమేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.



రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు గమనించాలని ఆ లేఖలో పేర్కోన్నారు.