Sajjala Ramakrishna Reddy : మావిగన్ లో జగన్ పేరుందని వాళ్లకి నచ్చడం లేదు.. అమ్మవారి పేరు కలిసేలా : సజ్జల రామకృష్ణా రెడ్డి
Sajjala Ramakrishna Reddy : అమరావతి ప్లాన్ బీ, మావిగన్ పేరుపై స్పందిస్తూ.. వైసీపీ సీనియర్ నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.
- Dharani Pilli
- Published On : April 4, 2026 / 04:23 PM IST
YSRCP Sajjala ramakrishna reddy on ys Jagan MAVIGUN and plan b for amaravathi
- చంద్రబాబు అమరావతి పేరుతో ప్రజాధనం తోడేస్తున్నారు
- ప్లాన్ బీ ఆ ప్రాంత ప్రజలకి నచ్చింది
- అమరావతిపై వైసీపీ స్పష్టమైన వైఖరి : సజ్జల
Sajjala Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని.. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అమరావతి రాజధాని విషయంలో వాస్తవాలు మేము చెప్తున్నాం. చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టి సంబరాలు చేసుకోండి అంటున్నాడు. చంద్రబాబు మాటలు అబద్ధాలలో ఆణిముత్యాలు.. అసలు ప్రజలెందుకు సంబరాలు చేసుకోవాలి..? ఏదో జరిగిపోయిందని క్రియేట్ చేస్తున్నారు. మోదీ రాష్ట్రానికి ఇచ్చింది మట్టి, నీళ్లు అని ఆనాడు దూషించి.. ఈరోజు అవే అద్భుతం అంటున్నారని విమర్శించారు.
‘ఇప్పుడు మళ్లీ అమరావతికి కులం రంగు పులుముతున్నారు. మేమెప్పుడూ కమ్మరావతి అనలేదు.. రేణుకా చౌదరి వ్యాఖ్యలను టీడీపీ ఎందుకు ఖండించలేదు? కమ్మరావతి కాదు అందరి రాజధాని అని టీడీపీ నేతలు ఎందుకు అనలేకపోయారు? చంద్రబాబు అమరావతిని గుదిబండ చేసి ఆ బరువును రాష్ట్రంపై వేస్తున్నారు. వెతికి వెతికి మాయాబజార్ లాంటి ప్రాంతంలో రాజధాని అని పెట్టారు. నిత్యం పంటలు పండే పచ్చటి పొలాలను పాడుచేసి రాజధాని అని పెట్టారు. అందినకాడికి స్వాహా చేయడానికి అక్కడ రాజధాని అని పెట్టారు. మోటార్ పెట్టి నీళ్లు తీసినట్లుగా అమరావతి పేరుతో ప్రజా ధనం తోడేస్తున్నారు’ అని సజ్జల ఆరోపించారు.
Amaravati Bill: రాజ్యసభలోనూ గ్రీన్‌సిగ్నల్.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం
‘రాజధాని విషయంలో మా పార్టీ అధ్యక్షుడు జగన్.. వాస్తవాలకు దగ్గరగా ప్రపోజల్ పెడితే ఎగతాళి చేస్తున్నారు. అమరావతి రాజధాని బరువును ప్రజలపై మోపకూడదనేది జగన్ ఆలోచన. అమరావతి విషయంలో జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. జగన్ ప్రతిపాదించిన ప్లాన్ బి (Plan B) తో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు బూస్టింగ్ వస్తుంది. అమరావతితో గుంటూరు, విజయవాడ రేట్లు పడిపోయాయి.. అవన్నీ పైకి లేస్తాయి.. ఈ ప్రాంత ప్రజలంతా సంతోషంగా స్వాగతిస్తున్నారు. ఇది రాష్ట్రానికి కూడా నచ్చుతుంది, ఖర్చు తక్కువ.. రాష్ట్రంపై భారం పడకుండా ఉంటుంది’ అన్నారు.
Chandrababu : దేవతల రాజధాని అమరావతి.. అందుకే జగన్ కి ఆ పేరు పలకడం ఇష్టం లేదు : సీఎం చంద్రబాబు
‘వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్ రెండు జగన్ ఆలోచన చేసినవే. వెస్ట్ బైపాస్ జగన్ పూర్తి చేశారు.. ఈస్ట్ బైపాస్ చంద్రబాబు తీసేశారు. కనెక్టివిటీ ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదు. ఈ మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ల్యాండ్‌కి కొదవ లేదు. ‘మావిగన్’ (MAVIGAN) లో జగన్ పేరు ఉందని వాళ్ళకి నచ్చలేదేమో. మావిగన్ కాకపోతే.. మీకు నచ్చిన పేరు పెట్టండి. అమరావతి మంచి పేరే.. లేదా దుర్గమ్మ పేరు కలిసేలా మరేదైనా పెట్టండి. రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించేలా ఏ పేరు అయినా పెట్టండి’ అని సజ్జల సూచించారు..
‘మావిగన్ అనడంతోనే ప్లాన్ B పై ప్రజల్లో చర్చ మొదలైంది. ప్లాన్ B అమలు అయితే ఏపీ రాజధాని ప్రాంతం కలకలాడిపోతుంది.. ప్లాన్ B కరెక్ట్ ప్రతిపాదన.. అమరావతి అనేది ప్రజల్ని దోచుకునే ప్రతిపాదన’ అంటూ సజ్జల స్పష్టం చేశారు.
