Chandrababu Tears: రాజకీయ లబ్ధి కోసం గౌరవాన్ని మీడియాకీడ్చారు – వైఎస్సార్సీపీ
సీఎం అయ్యాకే వస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు శపథం చేయడం, టీడీఎల్పీ సమావేశంలో కన్నీరు పెట్టడం. తన భార్యను కించపరిచారంటూ అవమానంగా మాట్లాడారంటూ..
- Subhan Ali Shaik
- Updated on- November 20, 2021 / 01:50 PM IST
Ysrcp
Chandrababu Tears: రెండ్రోజులుగా ఏపీ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తున్న ఒకటే టాపిక్. అసెంబ్లీ వేదికగా సీఎం అయ్యాకే వస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు శపథం చేయడం, టీడీఎల్పీ సమావేశంలో కన్నీరు పెట్టడం. తన భార్యను కించపరిచారంటూ అవమానంగా మాట్లాడారంటూ ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు చంద్రబాబు.
దీనిపై నందమూరి కుటుంబం స్పందించింది. బాలకృష్ణ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి నారా భువనేశ్వరిని కించపరిచారని ఖండించారు. మరోసారి ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. లోకేశ్ పుట్టుకపై చేసిన కామెంట్లకు లోకేశ్వరి, శ్రీనివాస్, చైతన్య కృష్ణలు మాట్లాడారు.
ఈ ప్రెస్ మీట్ అనంతరం.. వైసీపీ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. బాలకృష్ణను, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టింది. రాజకీయ లబ్ధికోసం సతీమణి గౌరవాన్ని మీడియాకు ఈడ్చారంటూ ఆరోపించింది.
………………………………….: నా అక్కను తిడితే తాట తీస్తాం – బాలకృష్ణ
‘కన్నతండ్రి ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు వేయించిన రోజు బయటకు రాలేదు. నేడు బాబును రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించడంతో.. రాజకీయ ఉనికి కోసం ”ఫ్యామిలీ సింపతీ” డ్రామా పండించే యత్నం. భువనేశ్వరి గారిని ఏ ఒక్కరూ ఒక్క మాట అనకపోయినా రాజకీయ లబ్ధి కోసం ఆమె గౌరవాన్ని మీడియాకీడ్చారు’ అంటూ పోస్టు చేశారు.
కన్న తండ్రి ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు వేయించిన రోజు బయటకు రాలేదు. నేడు బాబును రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించడంతో.. రాజకీయ ఉనికి కోసం "ఫ్యామిలీ సింపతీ" డ్రామా పండించే యత్నం. భువనేశ్వరి గారిని ఏఒక్కరూ ఒక్క మాట అనకపోయినా రాజకీయ లబ్దికోసం ఆమె గౌరవాన్ని మీడియాకీడ్చారు. pic.twitter.com/gRB7AFvZBW
— YSR Congress Party (@YSRCParty) November 20, 2021
