‘glass tumbler’ symbol ( Image Credit : Google )
Janasena Party Symbol : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించింది. పోటీ చేసిన 21 స్థానాలకు 21 సాధించి అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో జనసేనకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఎన్నికల ఫలితాల్లో భారీగా ఓట్లు రాబట్టిన జనసేనకు ఆ పార్టీ గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ పర్మినెంట్ చేయనుంది. వాస్తవానికి ఏదైనా ఒక పార్టీకి పర్మినెంట్ గుర్తు రావాలంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం చొప్పున ఓట్లను రాబట్టాలి. అందులో కనీసం 2 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు తప్పనిసరిగా గెలివాల్సి ఉంటుంది.
అప్పుడు మాత్రమే ఆయా పార్టీలకు వారు ఎంచుకున్న గుర్తును ఈసీ కేటాయిస్తుంటుంది. ఇప్పుడు, ఈ ఎన్నికల్లో జనసేన కూడా భారీగా సీట్లను దక్కించుకోవడంతో గాజు గ్లాసు సింబల్ టెన్షన్ తీరిపోయింది. అతి త్వరలో ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును అధికారికంగా కేటాయించనుంది.
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు. కానీ, ఈసారి కేవలం 21 స్థానాలకే పరిమితమైన పవన్ కల్యాణ్.. అన్ని సీట్లను గెలిపించుకుని మొదటిసారిగా ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.
Read Also : బీఆర్ఎస్ కుట్రతోనే కాంగ్రెస్ ఎనిమిది చోట్ల ఓడిపోయింది.. మోదీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు