Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ నాడే.. 100 ఏళ్ల తర్వాత అరుదైన పంచ మహాయోగాలు..ఈ 5 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు

Akshaya Tritiya 2026 Panch Mahayog : ఈ సంవత్సరం అక్షయ తృతియకు చాలా విశిష్టత ఉంది. ఆ రోజే అద్బుతమైన పంచ మహా యోగాలు కలిసి వస్తున్నాయి.

akshaya tritiya 2026 rare panch mahayog after 100 years on this day due and these five zodiac signs will gain wealth

Akshaya Tritiya Panch Mahayog : హిందువులు అక్షయ తృతీయను చాలా పవిత్రమైన శుభ దినంగా భావిస్తారు. “అక్షయ” అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. కనుకనే ఈ రోజున చేసే ఏ చిన్న మంచి పని అయినా, దానధర్మాలు చేసినా, కొత్త కొనుగోళ్లు చేసినా లేదా వ్యాపారాలు ప్రారంభించినా.. అనంతమైన ఫలితాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ సంవత్సరం ఏప్రిల్ 19న అక్షయ తృతీయ పండుగ వస్తోంది. అయితే ఈసారి అక్షయ తృతీయ మిగతా సంవత్సరాల మాదిరి కాదు, చాలా విశిష్టతను కలిగి ఉంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం, దాదాపు 100 ఏళ్ల తర్వాత అత్యంత అరుదైన రాజయోగాలు అక్షయ తృతీయ నాడే ఏర్పడుతున్నాయి. దీని వల్ల పలు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలగనున్నాయి.

అక్షయ తృతీయ నాడు ఏర్పడే విశిష్ట యోగాలు

  • పంచమహాపురుష యోగం: గ్రహాల రాజులు అత్యంత శక్తివంతమైన స్థానాల్లో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది పలు రాశుల వారికి అధికారాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.
  • గజకేసరి యోగం: గురు, చంద్రుల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది గౌరవ మర్యాదలను, అపారమైన మేధస్సును ఇస్తుంది.
  • సర్వార్థ సిద్ధి యోగం: ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుంది.
  • త్రిపుష్కర యోగం: ఈ యోగంలో చేసే పనుల ఫలితం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
  • శశ, మాళవ్య యోగం: శని, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల సంపద మరియు విలాసవంతమైన జీవితం ప్రాప్తిస్తాయి.

ముహూర్తం, తిథి వివరాలు

  • 2026లో అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 19వ తేదీ, ఆదివారం వస్తోంది.
  • తిథి ప్రారంభం: ఏప్రిల్ 19, ఉదయం 10:49 గంటలకు.
  • తిథి ముగింపు: ఏప్రిల్ 20, ఉదయం 07:27 గంటలకు.

లబ్ధి పొందే అదృష్ట రాశులు

ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు పంచ మహా యోగాలు ఏర్పడుతుండటం వల్ల ప్రధానంగా 5 రాశుల వారికి కాలం అద్భుతంగా ఉండబోతోంది. ఆ రాశులు:

  • మేష రాశి
  • వృషభ రాశి
  • సింహ రాశి
  • వృశ్చిక రాశి
  • కుంభ రాశి

ఈ రాశుల వారికి ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.