Mars Saturn Conjunction 2026 : 30 ఏళ్ల తర్వాత ఆ 2 గ్రహాల సంయోగం.. ఈ రాశుల వారికి ఏప్రిల్లో ఏం చేసినా దరిద్రమే.. దురదృష్టం వెంటాడుతుంది

Mars Saturn Conjunction 2026 : దాదాపు 30 ఏళ్ల తర్వాత శని, కుజ గ్రహాల సంయోగం జరిగింది. దీని వల్ల 4 రాశుల వారు దారుణమైన ఫలితాలను చవి చూడబోతున్నారని పండితులు చెబుతున్నారు.

april horoscope 2026 mars saturn conjunction impact on four zodiacs very badly

Mars Saturn Conjunction 2026 : కొన్ని గ్రహాల కలయిక అంతులేని అదృష్టాన్ని మోసుకొస్తే.. మరికొన్నింటి కలయిక కొన్ని రాశుల వారికి భయంకరమైన ఫలితాలు ఇస్తుంటాయి. అలాంటి ఓ గ్రహాల కలయిక గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అదే కుజ, శని గ్రహాల కలయిక. ఈ రెండూ కూడా విభిన్న స్వభావాలు గల గ్రహాలు. ఈ రెండూ ఏప్రిల్ 2న మీన రాశిలో సంయోగం చెందుతున్నాయి. దీని వల్ల నాలుగు రాశుల వారికి అనేక సమస్యలు ఎదురుకాబోతున్నాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. కుజుడు కుంభ రాశి సంచారంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశించడంతో.. ఈ రెండు విభిన్న స్వభావాలు గల గ్రహాల సంయోగం వల్ల నాలుగు రాశుల వారికి ఏప్రిల్ నెల అంతా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవంటే..

కుంభ రాశి:

కుజ, శని సంచారం వల్ల ఏప్రిల్ నెలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే రాశుల్లో కుంభ రాశి కూడా ఒకటి. ఈ నెల కుంభ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక సమస్యలు చవిచూస్తారంటున్నారు. వీటితో పాటు మానసిక సమస్యలు కూడా పెరుగుతాయంటున్నారు. కనుక ఏప్రిల్ నెలలో కుంభ రాశి వారు ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

సింహ రాశి:

ఏప్రిల్ నెలలో కుజ, శని గ్రహాల సంయోగం వల్ల సమస్యలు ఎదుర్కోబోయే మరో రాశి సింహ రాశి. వీరికి కూడా ఏప్రిల్ నెల అంతా ప్రతికూలంగా ఉంటుందంటున్నారు పండితులు. వీరు కూడా ఆర్థిక, మానసిక సమస్యలతో సతమతమవుతారని హెచ్చరిస్తున్నారు. అనుకోని సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆఫీసులో ఉన్నతాధికారులు, సీనియర్ల నుంచి చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.

మీన రాశి:

కుజ, శని సంయోగం సంభవించేది మీన రాశిలోనే. కనుక ఈ రాశి వారికి కూడా చెడు ఫలితాలు రాబోతున్నాయని.. వీరు తీవ్రమైన గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారని పండితులు చెబుతున్నారు. వీరు ఏ పని ప్రారంభించినా కలిసిరాదని.. అనుకోని సమస్యలు, అవాంతరాలు ఎదురవుతాయని అంటున్నారు. అనారోగ్య సమస్యలు అధికమవుతాయంటున్నారు. కుటుంబంలో కూడా గొడవలు పెరుగుతాయంటున్నారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. అనేక విధాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం, నిర్ణయాలు తీసుకోవడం మంచిది అంటున్నారు.

గమనిక : ఇక్కడ సమాచారాన్ని కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.