Daily Horoscope : రాశిఫలాలు 11 ఏప్రిల్ 2026.. ఈ రాశుల వారు నక్క తోక తొక్కారు.. కొత్త వాహనాలు, విశేష ఆదాయం..!

Daily Horoscope : ఏప్రిల్ 11, శనివారం నాడు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది.. ఏ రాశి వారికి కలిసి వస్తుంది.. ఎవరూ ఇబ్బంది పడతారు అంటే..

daily horoscope rasi phalalu for 2026 april 11 for 12 zodiacs

Daily Horoscope : సమాజంలో చాలా మంది రాశి ఫలాలను నమ్ముతారు. ఆ రోజు ఆ రాశి వారికి సానుకూలంగా ఉందంటే.. రోజంతా ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. అదే ప్రతికూల ఫలితాలు ఉంటాయంటే.. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో ఏప్రిల్ 11, శనివారం నాడు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది.. ఏ రాశుల వారికి కలిసి వస్తుంది.. ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి.. మెరుగైన ఫలితాల కోసం పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మేష రాశి:

ఏప్రిల్ 11, శనివారం నాడు మేష రాశి వారికి దశమ చంద్రుని ప్రభావం వల్ల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తి వివాదాలు తొలగి విశేష ధనయోగం కలుగుతుంది. అయితే స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

పరిహారం: దశరథ ప్రోక్త శని స్తోత్ర పారాయణం చేస్తే ఫలితం బాగుంటుంది.

2. వృషభ రాశి:

శనివారం నాడు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. నవమ చంద్రుని వల్ల ప్రారంభంలో బాగున్నా, కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా, ఆచి తూచి ఉండాలని సూచిస్తున్నారు.

పరిహారం: లక్ష్మీ ఆరాధన, వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మంచిది.

3. మిధున రాశి:

అష్టమ చంద్రుని వల్ల మిధున రాశి వారికి శనివారం నాడు తలపెట్టిన ప్రతి పనిలో అవరోధాలు ఎదురవ్వడమే కాక.. అపనిందల పాలయ్యే అవకాశం ఉంది. వీరికి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు వచ్చే అవకాశం ఉంది.

పరిహారం: శనేశ్వర కృత నరసింహ స్తుతి పారాయణం చేస్తే మేలు జరుగుతుంది.

4. కర్కాటక రాశి:

సప్తమ చంద్రుని ప్రభావంతో కర్కాటక రాశి వారికి శనివారం నాడు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది.

పరిహారం: శనేశ్వర కవచ పారాయణం, శివాలయ దర్శనం చేసుకోవాలి.

5. సింహ రాశి:

షష్ఠ చంద్రుని వల్ల శని వారం సింహ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. పట్టుదలతో కార్యసిద్ధి పొందుతారు.

పరిహారం: వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణం చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.

6. కన్య రాశి:

శనివారం నాడు కన్య రాశి వారికి పంచమ చంద్రుని వల్ల మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఓటమి భయం వేధిస్తుంది. వాహన ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం: కనకధారా స్తోత్ర పారాయణం, అమ్మవారి దర్శనం చేసుకోవాలి.

7. తులా రాశి:

ఏప్రిల్ 11, శనివారం నాడు చతుర్థ చంద్రుని వల్ల తులా రాశి వారికి ఆందోళనలు, అధిక ధన వ్యయం ఉంటాయి. ఆస్తి పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య స్వల్ప అనారోగ్య సమస్యలు, బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపార విషయాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి.

పరిహారం: మూకాంబికా స్తోత్ర పారాయణం చేసి, దుర్గాదేవిని దర్శించుకుని సహస్రనామార్చన చేయిస్తే విశేష ఫలితం లభిస్తుంది.

8. వృశ్చిక రాశి:

తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల అనుగ్రహం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఒక స్త్రీ వల్ల అపజయం కలిగే పరిస్థితి నుంచి విజయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు ఉపయోగపడే వారు తారసపడతారు.

పరిహారం: దత్తాత్రేయ స్తోత్ర పారాయణం, గురు దర్శనం చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడతారు.

9. ధనస్సు రాశి:

శనివారం నాడు ధనస్సు రాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని వల్ల భయాందోళనలు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక బదిలీలు లేదా స్థాన చలనం జరగవచ్చు. ఎవరికీ హామీలు ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. మౌనాన్ని ఆయుధంగా పాటిస్తే చాలా వరకు సమస్యలు సమసిపోతాయి.

పరిహారం: రాహు కవచ పారాయణం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల మేలైన ఫలితాలు కలుగుతాయి.

10. మకర రాశి:

జన్మ స్థానంలో చంద్రుని ప్రభావం వల్ల వృత్తి, వ్యాపారాల్లో విశేష అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్తు, వాహన ప్రాప్తి ఉంది. ఉన్నత స్థితిని పొందుతారు.

పరిహారం: కాలభైరవ అష్టక పారాయణం, శివాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది.

11. కుంభ రాశి:

ద్వాదశ చంద్రుని సంచారం వల్ల శనివారం కుంభరాశి వారు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. అధిక ధన వ్యయం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. సంతానపరంగా ఇబ్బందులు ఉండవచ్చు.

పరిహారం: కిరాతాష్టక పారాయణం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు.

12. మీన రాశి:

శనివారం నాడు మీన రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఏకాదశ చంద్రుని వల్ల పాత బాకీలు వసూలై, తృప్తి కలుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు అదృష్టవంతులుగా రాణిస్తారు.

పరిహారం: హనుమత్ స్తోత్ర పారాయణం, ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేస్తే మరింత మేలు జరుగుతుంది.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రేక్షకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.