Today Horoscope 21 April in Telugu : రాశి ఫలాలు 21 ఏప్రిల్.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త.. వీరు మాత్రం విలువైన ఆభరణాలు పోగొట్టుకుంటారు

Daily horoscope in Telugu 21 April 2026 : ఏప్రిల్ 21 మంగళవారం జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి. మరి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే..

horoscope today 21 april 2026 tuesday rasi phalalu telugu

Today Horoscope 21 April in Telugu : ఏప్రిల్ 21, మంగళవారం వైశాఖ మాసం, శుక్ల పక్షం, పంచమి (రాత్రి 01:20 వరకు, ఆ తర్వాత షష్ఠి). ఈరోజు మధ్యాహ్నం 03:11 నుండి 04:45 వరకు రాహుకాలం ఉంది. మంగళవారం నాటి విశేషం ఏంటంటే.. ఈ రోజు జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి. ఈ సందర్భంగా శంకర అష్టోత్తరాన్ని పారాయణ చేయడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. మరి ఇంత శుభప్రదమైన రోజున ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

12 రాశుల రాశి ఫలాలు

మేష రాశి:

మంగళవారం మేష రాశి వారికి భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కలగవచ్చు.

పరిహారం: శ్రీ దత్త ఘోర కష్టోద్ధారక స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.

వృషభ రాశి:

ఈ రోజు వృషభ రాశి వారికి ఆరోగ్య అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ధనాదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

పరిహారం: అంగారక స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం.

మిథున రాశి:

మిథున రాశి వారికి వ్యయస్థానంలో చంద్ర సంచారం వల్ల ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రక్త దర్శనం, ఆయుధాల భయం ఉండవచ్చు.

పరిహారం: కాలభైరవ లేదా వీరభద్ర స్వామి దర్శనం.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ రోజు విశేష ధనయోగం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.

పరిహారం: కనకధారా స్తోత్ర పారాయణ, లక్ష్మీ దేవి దర్శనం.

సింహ రాశి:

మంగళవారం సింహ రాశి వారికి రాజకీయ వ్యవహారాల్లో జయం కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తిలో కమాండింగ్ పొజిషన్‌లో ఉంటారు.

పరిహారం: దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ.

కన్య రాశి:

కన్య రాశి వారికి వృత్తిపరంగా భయం, ఆందోళన ఉండవచ్చు. ఆదాయం ఖర్చులకు సరిపోతుంది. స్త్రీల మూలక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

పరిహారం: రుణవిమోచన నరసింహ స్తోత్ర పారాయణ.

తులా రాశి:

తులా రాశి వారికి అకారణ విరోధాలు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. శత్రు వృద్ధి కనిపిస్తోంది.

పరిహారం: విష్ణు దర్శనం, శ్రీ ఆదివరాహ స్తోత్ర పారాయణ.

వృశ్చిక రాశి:

మంగళవారం కలిసి వచ్చే రాశుల్లో వృశ్చిక రాశి వారు ముందు వరుసలో ఉన్నారు. వీరు చేసే పనుల్లో అభివృద్ధి, అధికారుల మన్ననలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

పరిహారం: అంగారక కవచ పారాయణ, గోసేవ.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి సమాజంలో హోదా కలిగిన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి.

పరిహారం: నవరత్న మాలికా స్తోత్ర పారాయణ.

మకర రాశి:

మకర రాశి వారికి బద్ధకం, పనుల్లో జాప్యం ఉండవచ్చు. అనవసర ఖర్చులు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది.

పరిహారం: ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర పారాయణ.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి.

పరిహారం: నవగ్రహ పీడా పరిహార స్తోత్ర పారాయణ.

మీన రాశి:

మీన రాశి వారికి మంగళవారం శుభకార్యాలకు అనుకూలమైన రోజు. ధన ప్రాప్తి ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం: కేతు కవచ పారాయణ, గణపతి దర్శనం.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.