Today Horoscope in Telugu: రాశి ఫలాలు 24 ఏప్రిల్.. ఈ రాశి వారు నక్క తోక తొక్కారు.. ప్రమోషన్, ధన లాభం.. అదృష్టం మీ వెంటే..!

Daily horoscope in Telugu : శుక్రవారం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే..

Horoscope Today 24 April 2026 friday Rasi Phalalu Telugu

Today Horoscope 24 April in Telugu : ఏప్రిల్ 24, శుక్రవారం వైశాఖ మాసం అష్టమి తిథి. ఈ రోజు అమృత ఘడియలు: మధ్యాహ్నం 02:00 నుండి 03:35 వరకు ఉంటాయి. రాహుకాలం: ఉదయం 10:26 నుండి మధ్యాహ్నం 12:01 వరకు, యమగండం: మధ్యాహ్నం 03:11 నుండి సాయంత్రం 04:45 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 08:00 నుండి 09:04 వరకు మరియు మధ్యాహ్నం 12:26 నుండి 01:17 వరకు ఉండనుంది. మరి శుక్రవారం నాడు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే..

ద్వాదశ రాశి ఫలాలు:

1. మేష రాశి

శుక్రవారం మేష రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు, మోసపోయే అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో (కంటి సమస్యలు) జాగ్రత్త అవసరం. రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది.

పరిహారం: రాహు కవచం పారాయణం, దుర్గా దేవి దర్శనం.

2. వృషభ రాశి:

వృషభ రాశి వారికి శుక్రవారం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. స్త్రీ మూలక ధన లాభం ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.

పరిహారం: శ్రీ బాలాంబికా అష్టకం పారాయణం, గ్రామ దేవత దర్శనం.

3. మిథున రాశి:

శుక్రవారం మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. సహోద్యోగులతో అపనిందలు పడే అవకాశం ఉంది.

పరిహారం: దత్తాత్రేయ హృదయం పారాయణం, విష్ణు ఆలయ దర్శనం.

4. కర్కాటక రాశి:

ఏప్రిల్ 24, శుక్రవారం నాడు కర్కాటక రాశి వారికి కోరుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. బంధుమిత్రుల సహకారం అందుతుంది. నూతన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం: ఆంజనేయ మంగళాష్టకం పారాయణం, హనుమాన్ దర్శనం.

5. సింహ రాశి:

సింహ రాశి వారు శుక్రవారం విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త వద్దు. మానసిక అశాంతి ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పనిలో శ్రద్ధ అవసరం. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం: భూతనాథ దశకం పారాయణం, శివాలయ దర్శనం.

6. కన్యా రాశి:

శుక్రవారం కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు అనుకూలం. మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

పరిహారం: శ్యామలా దండకం పారాయణం, గోసేవ చేయడం.

7. తులా రాశి:

ఏప్రిల్ 24, శుక్రవారం తులా రాశి వారికి గతంలో ఉన్న బాధల నుంచి విముక్తి కలుగుతుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు అనుకూల సమయం. కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

పరిహారం: షష్టీ దేవి స్తోత్రం పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం.

8. వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు కలిసి రాదు. మానసిక నిరుత్సాహం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. కోపం నియంత్రించుకోవడం అవసరం. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు.

పరిహారం: కనకధారా స్తోత్రం పారాయణం, లక్ష్మీ దేవి దర్శనం.

9. ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఏప్రిల్ 24, శుక్రవారం నాడు అనవసర ఖర్చులు పెరుగుతాయి. ధన నష్టం, అవమానాలు జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో వ్యతిరేకత ఎదురుకావచ్చు. ప్రయాణాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

పరిహారం: దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం, అమ్మవారికి పటిక బెల్లం నైవేద్యం.

10. మకర రాశి:

శుక్రవారం నాడు అన్ని విధాల కలిసి వచ్చే రాశి మకర రాశి. వీరికి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మధ్యవర్తిత్వం ద్వారా విజయం సాధిస్తారు.

పరిహారం: శుక్ర కవచం పారాయణం, లక్ష్మీ దేవాలయ దర్శనం.

11. కుంభ రాశి:

కుంభ రాశి వారికి శుక్రవారం నాడు ఎటువంటి క్లిష్టమైన పనైనా సులభంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత సమస్యలు తొలగిపోతాయి. అయితే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

పరిహారం: గణనాయక అష్టకం పారాయణం, వినాయకుని దర్శనం.

12. మీన రాశి:

మీన రాశి వారికి శుక్రవారం నాడు పెద్దగా కలిసి రాదు. కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఓటమి భయం వేధిస్తుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సహోద్యోగుల వల్ల ఆటంకాలు కలగవచ్చు. సమయ పాలన పాటించడం ముఖ్యం.

పరిహారం: అపరాజిత స్తోత్రం పారాయణం చేయడం శుభకరం.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. 10tv దీన్ని నిర్ధారించడం లేదు.