Today Horoscope in Telugu: రాశి ఫలాలు ఏప్రిల్ 30.. నరసింహ జయంతి నాడు ఈ రాశి వారికి అదృష్టం.. పంట పండింది పో..!
Daily horoscope in Telugu 30 April : ఏప్రిల్ 30, గురువారం నరసింహ జయంతి నాడు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే..
- Dharani Pilli
- Updated on- April 29, 2026 / 10:00 PM IST
Horoscope Today 30 April 2026 Thursday Rasi Phalalu Telugu
Today Horoscope in Telugu : ఏప్రిల్ 30, 2026, గురువారం నాడు నరసింహ జయంతి. నేడు శుక్ల పక్ష చతుర్దశి రాత్రి 9:01 వరకు ఉండి, ఆ తర్వాత పౌర్ణమి ప్రారంభమవుతుంది. చిత్తా నక్షత్రం రాత్రి 2:07 వరకు ఉంటుంది.
- అమృత గడియలు: రాత్రి 7:21 నుండి 9:05 వరకు.
- రాహుకాలం: మధ్యాహ్నం 1:48 నుండి 3:08 వరకు.
ద్వాదశ రాశి ఫలాలు
మేష రాశి:
మేష రాశి వారికి ఈరోజు ధన యోగం కలగనుంది. వంశపారంపర్య ఆస్తుల సమస్యలు పరిష్కారమవుతాయి. అధికారుల అనుగ్రహం లభిస్తుంది. అయితే, భార్య లేదా స్త్రీల వల్ల స్వల్ప ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
వృషభ రాశి:
నేడు వృషభ రాశి వారికి సంతాన సౌఖ్యం, ధన యోగం ఉన్నప్పటికీ, పనుల పట్ల శ్రద్ధ తగ్గడం లేదా ఆటంకాలు ఎదురుకావచ్చు. విద్యార్థులకు ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.
మిథున రాశి:
గురువారం మిథున రాశి వారికి అపనిందలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి.
కర్కాటక రాశి:
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలత ఉంటుంది. వాహన సౌఖ్యం పొందుతారు.
సింహ రాశి:
గురువారం సింహ రాశి వారికి పాత బాకీలు వసూలవుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అయితే ఉద్యోగంలో సహచరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి గురువారం మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కంటికి మరియు మోకాళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు పీడించవచ్చు. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం.
తులా రాశి:
తులా రాశి వారికి నేడు ఆందోళనలు, అధిక ధన వ్యయం కనిపిస్తోంది. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక స్త్రీ సహాయంతో ఆటంకాలు తొలగి జయం లభిస్తుంది. భూసంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి.
ధనుస్సు రాశి:
ధనస్సు రాశి వారికి గురువారం ఆర్థిక సమస్యలు, భయాందోళనలు ఎదురుకావచ్చు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరికీ హామీలు (షూరిటీ) ఇవ్వకూడదు.
మకర రాశి:
గురువారం మకర రాశి వారికి నూతన వస్తు, వాహన ప్రాప్తి ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు.
కుంభ రాశి:
నేడు కుంభ రాశి వారికి అధిక ఒత్తిడి, ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వపరమైన జరిమానాలు పడే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలి.
మీన రాశి:
ఈరోజు అత్యంత అదృష్టవంతులు మీన రాశి వారే. పాత బాకీలు వసూలవడమే కాకుండా, విద్యార్థులు చదువులో రాణిస్తారు. శత్రువుల నుండి ఉపశమనం లభిస్తుంది.
పరిహారాలు:
ప్రతికూల ఫలితాలు ఉన్నవారు దశరథ కృత శని స్తోత్రం, శనేశ్వర కవచం లేదా అమ్మవారి స్తోత్రాలను పారాయణం చేయడం వల్ల ఉపశమనం కలుగుతుందని గురూజీ వివరించారు.
