Jupiter Transit 2026 : గురు సంచారం.. ఈ రెండు రాశుల వారికి దారుణమైన అవమానాలు, జీవితం తలకిందులవుతుంది.. జాగ్రత్త..!
Jupiter Transit 2026 : గురు గ్రహ సంచారం వల్ల రెండు రాశుల వారు దారుణమైన ఫలితాలు చవి చూడబోతున్నారు.
- Dharani Pilli
- Updated on- May 24, 2026 / 09:46 PM IST
Jupiter Transit 2026 Gemini Libra Zodiac Signs Face Unexpected Problems and Humiliation
Jupiter Transit 2026 : మనిషి జీవితంపై నవగ్రహాల ప్రభావం చాలా వరకు ఉంటుంది. ఈ నవగ్రహాల్లో ముఖ్యంగా రాహువు, కేతువు, శని గ్రహాలు చాలా తీవ్ర ప్రభావాలు చూపుతాయని పండితులు చెబుతున్నారు. ఇక గ్రహాల్లో ముఖ్యమైనది బృహస్పతి. ఈ గురు గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశులపై చాలా ప్రభావం ఉంటుంది. కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుండగా.. కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జూన్ 2న గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఈ గురు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతుండగా.. కొన్ని రాశుల వారు మాత్రం దారుణమైన ఫలితాలు చూడబోతున్నారని పండితులు చెబుతున్నారు.
జూన్ 2న జరగబోయే గురు సంచారం వల్ల రెండు రాశుల వారికి బాధలు, కష్టకాలం మొదలుకానుంది. కనుక కొన్ని రోజుల పాటు ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే పెద్ద నష్టమే జరగబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారు దారుణమైన ఫలితాలు చవిచూడబోతున్నారని పండితులు చెబుతున్నారు. ఈ గురు సంచారం వల్ల మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొత్త మలుపులు, ఇబ్బందులు వస్తాయి. ఈ రాశి వారికి పనిభారం కూడా పెరుగుతుంది. ఈ గురు సంచారం వల్ల మిథున రాశి వారికి మానసిక ఒత్తిడి, టెన్షన్ పెరుగుతాయి. అలాగే మిథున రాశి వారు అధికారులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, అది మీకే మంచిది అంటున్నారు. అలానే మిథున రాశి వారు వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు అస్సలు పెట్టకండి.
గురు గ్రహ సంచారం వల్ల తులా రాశి వారికి ఇంట్లో చిక్కులు, చికాకులు ఎక్కువవుతాయి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా అనవసరంగా ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. పక్కన ఉన్న శత్రువుల నుంచి కొత్త ఇబ్బందులు వస్తాయి, డబ్బు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా కోర్టు కేసులు, చట్టపరమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.
