Debt Clear Mantras: ఈ రుణ విమోచన మహాగణపతి స్తోత్రం చదివితే మీ అప్పులన్నీ మటాష్..

అప్పులు పోవడానికి, సంపద పెరిగడానికి, రుణ విమోచన గణపతి స్తోత్రం పారాయణ చెయ్యాలి.

  • Published By: Mahesh T ,Published On : November 8, 2025 / 12:37 PM IST
Debt Clear Mantras: ఈ రుణ విమోచన మహాగణపతి స్తోత్రం చదివితే మీ అప్పులన్నీ మటాష్..

Updated On : November 8, 2025 / 12:39 PM IST

Debt Clear Mantras: ఈ రోజు కార్తీక మాసంలో (నవంబర్ 8) సంకష్టహర చతుర్థి. ఎంతో కాలంగా ఏదైనా పని సాగడం లేదా? ఏపని తలపెట్టినా ఆలస్యం అవుతోందా? రుణాలు తీరడం లేదా? అయితే, ఈ రోజు తప్పకుండా చేయాల్సిన పని ఒకటి ఉంది. అదే రుణవిమోచన మహాగణపతి స్త్రోత్రం. అప్పులు పోవడానికి, సంపద పెరగడానికి, రుణ విమోచన గణపతి స్తోత్రం పారాయణ చెయ్యాలి. సంతాన సమస్యలు పోవడానికి సంతాన గణపతి స్తోత్రం పారాయణ చెయ్యాలి. ఇతర సమస్యలకి సంకట నాశన గణపతి స్తోత్రం చెయ్యాలి. ఈ రోజు సాయంత్రం 5 నుంచి 7 మధ్య పారాయణలు చెయ్యడం మంచిది.

శ్రీ రుణవిమోచన మహాగణపతి స్తోత్రం
స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ |
షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే || ౧ ||

ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్ |
ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే || ౨ ||

మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ |
మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే || ౩ ||

కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనమ్ |
కృష్ణసర్పోపవీతం చ నమామి ఋణముక్తయే || ౪ ||

రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్ |
రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౫ ||

పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనమ్ |
పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౬ ||

ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనమ్ |
హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౭ ||

ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్ |
చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే || ౮ ||

ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః |
షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి || ౯ ||

ఇతి ఋణవిమోచన మహాగణపతి స్తోత్రమ్ |