Career horoscope 2026 : ఉద్యోగ రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి పరాభవ నామ సంవత్సరం ఒక వరం.. ఉద్యోగ భద్రత, ప్రమోషన్.. అన్నీ..!
Career Horoscope 2026 : 2026 పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల ఉద్యోగులకు ఎలా ఉండబోతుంది.. ఎవరికి మేలు జరుగుతుంది.. ఎవరు నష్టపోతారంటే..
- Dharani Pilli
- Published On : March 17, 2026 / 04:42 PM IST
parabhava nama samvatsara panchangam 2026 udyoga rasi phalalu Professionals horoscope
Career Horoscope 2026 : పరాభవ నామ సంవత్సరంలో 12 రాశులకు సంబంధించిన ఉద్యోగ, వృత్తిపరంగా ఎలా ఉండబోతుందో.. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశి ఉద్యోగులకు కలిసి వస్తుంది, ఎవరికి నిరాశ ఎదురవుతుందనే దాని గురించి జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరణ ఇచ్చారు. ఉద్యోగానికి కారకుడైన శని, అభివృద్ధిని ఇచ్చే బృహస్పతి (గురుడు), రాహు-కేతువుల గ్రహ స్థితిని బట్టి ఈ సమాచారాన్ని వెల్లడించారు.
రాశుల వారీగా ఫలితాలు:
మేష రాశి: పరాభవ నామ సంవత్సరం ప్రారంభంలోనే మేష రాశి ఉద్యోగులు శుభ వార్త వింటారు. ఆగిపోయిన ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పోలీస్, డిఫెన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా బాగుంటుంది అని తెలిపారు.
వృషభ రాశి: ఈ రాశి ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని.. పని ఒత్తిడి పెరిగినా ఓపిక పడితే విజయం వరిస్తుంది అంటున్నారు. అయితే వృషభ రాశి వారు ఆఫర్ లెటర్ చేతిలో లేకుండా ఉద్యోగం మారవద్దని సూచిస్తున్నారు.
మిధున రాశి: ఈ సంవత్సరం మిధున రాశి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మీడియా, మార్కెటింగ్, ఐటీ రంగాల వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని.. విదేశీ ప్రయాణ కల నెరవేరుతుందంటున్నారు.
కర్కాటక రాశి: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి కెరీర్‌లో స్థిరత్వం లభిస్తుందని.. సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుందంటున్నారు. మేనేజర్లు, అధికారుల మద్దతు లభిస్తుందని వెల్లడించారు.
సింహ రాశి: పరాభవ నామ సంవత్సరంలో సింహ రాశి ఉద్యోగులకు అధికారిక గుర్తింపు లభిస్తుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కాకపోతే అహంకారాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలంటున్నారు.
కన్యా రాశి: పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి.. ఇప్పటి వరకు పడిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందంటున్నారు. అకౌంట్స్, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాల వారికి మేలు జరుగుతుందని సూచించారు. అయితే పని వత్తిడి వల్ల కన్యా రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తులా రాశి: ఈ రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. క్రియేటివిటీ, ఇంజనీరింగ్, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి.
వృశ్చిక రాశి: ఉగాది పండుగ తర్వాత వృశ్చిక రాశి వారికి ఊహించని విధంగా ప్రమోషన్లు రావచ్చంటున్నారు. అలానే ఐటీ సెక్యూరిటీ, డేటా అనాలసిస్, AI రంగాల వారికి డిమాండ్ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ధనుస్సు రాశి: ఉగాది తర్వాత నుంచి ధనుస్సు రాశి వారికి కెరీర్‌లో కొత్త దశ ప్రారంభమవుతుందని.. ఉన్నత విద్య ద్వారా పదవి పెరుగుతుందని చెబుతున్నారు. కాకపోతే వినయంగా ఉంటేనే విజయం దక్కుతుందంటున్నారు.
మకర రాశి: ఈ ఏడాది మకర రాశి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లభిస్తుంది. సీనియారిటీకి తగ్గ గౌరవం దక్కుతుంది. కొత్త బాధ్యతలు పెరుగుతాయంటున్నారు.
కుంభ రాశి: ఈ సంవత్సరం కుంభ రాశి వారికి.. వినూత్నమైన ఐడియాల వల్ల ఉన్నత పదవులు లభిస్తాయి. ఐటీ, సైన్స్, టెక్నాలజీ రంగాల వారికి ఈ సంవత్సరం ఒక వరం అని చెప్పవచ్చు.
మీన రాశి: పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి ఉద్యోగులకు ఫారిన్ జాబ్ కల నెరవేరుతుంది. మెడిసిన్, ఆర్ట్స్ రంగాల వారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆఫీస్ రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవల ప్రేక్షకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడమైంది. దీనికి ఏలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేదు.
