Love Horoscope 2026 : ఉగాది 2026 పంచాగం.. ప్రేమికులు ఈ జాగ్రత్తలు పాటించకపోతే.. బ్రేకప్ తప్పదు..!

Love Horoscope 2026 : 2026 సంవత్సరంలో ప్రేమికులు ఎలా ఉండబోతున్నారు.. వారి బంధం బలపడుతుందా.. బ్రేకప్ చెప్పుకుంటారా అనే వివరాలు..

parabhava nama samvatsara ugadi 2026 panchangam love horoscope

Love Horoscope 2026 : తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. మార్చి 19న ఉగాది పండుగ. పరాభవ నామ సంవత్సరంలోకి ప్రవేశిస్తాము. మరి ఈ ఏడాది 12 రాశుల వారికి పలు అంశాల్లో ఎలా ఉండబోతుందనే దాని గురించి పలువురు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. అలానే లవర్స్‌కి సంబంధించి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది.. కలిసే ఉంటారా.. బ్రేకప్ చెప్పుకుంటారా అనే దాని గురించి ఆసక్తికర సమాచారం వెల్లడించారు. ఆ వివరాలు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని ప్రేమకు కారకుడిగా భావిస్తారు. ఇది మనిషి జీవితంలో ప్రేమ వ్యవహారాలను నియంత్రిస్తుంది. ఎలా అంటే ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, వారి జీవితం ప్రేమమయం అవుతుందంటున్నారు. ఒకవేళ శుక్రుడు శనితో కలిసి ఉన్నప్పుడు సంబంధాల్లో భావోద్వేగ దూరాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు.

2026 ప్రేమ రాశిఫలం ప్రకారం, రాహువు, కేతువుల దుష్ప్రభావం చాలా రాశుల వారి ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు పండితులు. అందుకే భాగస్వామితో నిజాయతీగా వ్యవహరించాలని.. అనుమానం వచ్చేలా ప్రవర్తించకూడదని.. అబద్ధాలు చెప్పవద్దని సూచిస్తున్నారు. వీటిని పాటిస్తే.. 2026 ఏడాదిలో ప్రేమికులకు ఎలాంటి సమస్యలు తలెత్తవని అంటున్నారు. ఈ సంవత్సరం అన్ని రాశుల ప్రేమికులకు కలిసి వస్తుందని.. కొందరి విషయంలో మాత్రమే చెడు ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు. అలానే ఈ సంవత్సరం చాలా మంది ప్రేమ వివాహం చేసుకుంటారని చెబుతున్నారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం పాఠకులు ఆసక్తి మేరకు ఇవ్దమైంది. ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.