Dhanasu Rasi Phalalu 2026 : ధనస్సు రాశి వారికి అలర్ట్.. 9 నెలలు అష్ట కష్టాలే.. అవమనాలు, మోసం, ధన నష్టం

Dhanasu Rasi Phalalu 2026 : 2026, ఉగాది పండగ నుంచి ధనస్సు రాశి వారికి పెద్దగా కలిసి రాదని.. అవమానం, ధన నష్టం జరుగుతుందని అంటున్నారు.

Parabhava nama samvatsara ugadi panchangam 2026 Vrischika rasi phalalu Scorpio horoscope

Dhanasu Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి పెద్దగా కలిసి రాదని.. కేవలం మూడు నెలలు మాత్రమే వీరికి అనుకూల సమయం ఉందని.. మిగతా 9 నెలలు ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అవమానం వంటివి తప్పవని హెచ్చరిస్తున్నారు. ధనస్సు రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో మూడు నెలల సమయం మాత్రమే అనుకూలం. అది కూడా జూన్ వరకు మాత్రమే కాబట్టి.. ఆ లోపు వివాహాది శుభకార్యాలు చేయాల్సి ఉంటే వాటిని పూర్తి చేస్తే మంచిదంటున్నారు. ఆ తర్వాత కలిసి రాదని అంటున్నారు.

ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 5, అవమానం: 6 గా ఉండబోతుంది.

కీలక ఫలితాలు – సూచనలు:

జూన్ నుండి అక్టోబర్ వరకు కష్టకాలం:
ఈ ఐదు నెలల కాలంలో ధనస్సు రాశి వారికి సంబంధించి గురువు అష్టమ స్థానంలోకి వెళ్లడం వల్ల అవమానాలు, మోసాలు, ధన నష్టం, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు పండితులు. మరీ ముఖ్యంగా ధనస్సు రాశికి చెందిన యువతీ యువకులు డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు.

నవంబర్ నుండి జనవరి వరకు రాజయోగం:
నవంబర్, డిసెంబర్, జనవరి మూడు నెలల్లో గురువు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ధనస్సు రాశి వారికి రాజయోగం పడుతుంది. కొత్త పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు కలిగే అవకాశం ఉందంటున్నారు పండితులు.

పరిహారాలు:

  • వారాహి అమ్మవారి మాల ధరించడం మరియు ప్రవాళ గణపతిని నిత్యం పూజించడం శ్రేయస్కరం.
  • శ్రీ మహాలక్ష్మి యాగం: అక్షయ తృతీయ కంటే ధనత్రయోదశి నాడు యాగం చేసుకోవడం ఈ రాశి వారికి ఎక్కువ యోగిస్తుంది.
  • దైవ దర్శనం: ద్వారక (గుజరాత్) వెళ్లి శ్రీకృష్ణుడిని, సోమనాథ్‌లో శివుడిని దర్శించుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
  • స్థాన మార్పు: పల్లెటూర్ల నుండి నగరాలకు మారాలనుకునే వారికి జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలం చాలా అనుకూలమైనది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.